దసరా, దీపావళి తదితర వరుస పండుగల వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో తీపి కబురు చెప్పింది. పండుగ సీజన్‌లో ఉండే విపరీతమైన ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

ఈ ప్రత్యేక రైళ్లలో గుంటూరు – వికారాబాద్ – గుంటూరు మధ్య నడిచే రైళ్లతో పాటు యశ్వంతపూర్ నుంచి అమృత్‌సర్ వరకు వెళ్లే సుదూర ప్రాంత ప్రత్యేక రైలు కూడా ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్ - వివరాలు:
- గుంటూరు - వికారాబాద్ పండుగ స్పెషల్ (రైలు నంబర్ - 07227) : ఈ రైలు 08.10.2026, 10.10.2026 తేదీల్లో రాత్రి 21:45 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
- వికారాబాద్ - గుంటూరు పండుగ స్పెషల్ (రైలు నంబరు: 07228): తిరుగు ప్రయాణంలో ఈ రైలు 09.10.2026 మరియు 11.10.2026 తేదీల్లో రాత్రి 22:00 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 06:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
స్టాపేజీలు….
ఈ రెండు రైళ్లు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చార్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
యశ్వంతపూర్ - అమృత్‌సర్ స్పెషల్ ట్రెయిన్ (రైలు నంబరు: 06539) ఈ ప్రత్యేక రైలు 08.10.2026 నాడు రాత్రి 22:40 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, మూడో రోజు మధ్యాహ్నం 13:50 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది.
{{/usCountry}}యశ్వంతపూర్ - అమృత్‌సర్ స్పెషల్ ట్రెయిన్ (రైలు నంబరు: 06539) ఈ ప్రత్యేక రైలు 08.10.2026 నాడు రాత్రి 22:40 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి, మూడో రోజు మధ్యాహ్నం 13:50 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది.
{{/usCountry}}ఈ రైలు యెలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, వాడి, కలబురగి, సోలాపూర్, కుర్దువాడి, దౌండ్, అహల్యానగర్, కోపర్‌గావ్, మన్మాడ్, భూసావల్, ఖాండ్వా, ఇటార్సి, జబల్‌పూర్, కట్ని, సత్నా, చిత్రకూట్‌ధామ్ కర్వీ, బందా, VGL ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ, అంబాలా కాంట్, లుధియానా, జలంధర్ సిటీ మరియు బియాస్ స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలులో స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. పండుగల సమయంలో సాధారణ రైళ్లలో సీట్లు దొరకక ఇబ్బంది పడే ప్రయాణికులకు ఈ పండుగ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఈ రైళ్లకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించారు.