...
...
Next Story

SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్... గుంటూరు - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ వివరాలివే

SCR Guntur Charlapalli Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు - చర్లపల్లి మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి.

Published on: Sep 6, 2026, 05:12:16 IST
Advertisement

SCR Guntur Charlapalli Special Trains : తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు గుంటూరు నుండి హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

రైళ్ల వివరాలు…

  • గుంటూరు - చర్లపల్లి రైలు (రైలు నంబరు 07227) : ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 6, 2026 ఆదివారం రోజున రాత్రి 21:45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు (సెప్టెంబర్ 7) ఉదయం 04:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
  • చర్లపల్లి - గుంటూరు రైలు (రైలు నంబరు 07228 ): తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు సెప్టెంబర్ 7, 2026 సోమవారం రోజున రాత్రి 23:50 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 06:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

ఇరువైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు వివిధ శ్రేణుల సీట్లు అందుబాటులో ఉన్నాయి. AC 2-టియర్ (2A), AC 3-టియర్ (3A), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను ఈ రైళ్లకు కేటాయించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe