...
...
Next Story

తెలుగు ప్రయాణికులకు అప్డేట్... గుంటూరు - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు! టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల వివరాలివే

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.

Published on: Aug 29, 2026, 19:57:45 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మంచి శుభవార్త అందించింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ఆ రద్దీని నియంత్రించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు గుంటూరు - వికారాబాద్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

  • రైలు నంబరు 07227 (గుంటూరు – వికారాబాద్) : ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 30న (ఆదివారం) రాత్రి 9:45 గంటలకు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు (ఆగస్టు 31, సోమవారం) ఉదయం 5:00 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
  • రైలు నంబరు 07228 (వికారాబాద్ – గుంటూరు) : తిరుగు ప్రయాణంలో ఈ ప్రత్యేక రైలు 2026 ఆగస్టు 31న (సోమవారం) రాత్రి 10:00 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు (సెప్టెంబర్ 1, మంగళవారం) ఉదయం 6:10 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.

స్టాప్‌ల వివరాలు:

గుంటూరు - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంటూరు - వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో పలు కీలకమైన స్టేషన్లలో ఆగుతాయి. ఆ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి….

  • సత్తెనపల్లి
  • పిడుగురాళ్ల
  • నడికుడి
  • మిర్యాలగూడ
  • నల్గొండ
  • చార్లపల్లి
  • సికింద్రాబాద్
  • బేగంపేట్
  • లింగంపల్లి

కోచ్‌ల వివరాలు:=…

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని వర్గాల వారికి తగినట్లుగా సీటింగ్ వసతి కల్పించారు. వీటిలో సెకండ్ ఏసీ (2A), థర్డ్ ఏసీ (3A), స్లీపర్ క్లాస్ (Sleeper Class) మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe