ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సింహాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అత్యాధునిక కోచ్‌లు..!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణ భద్రత, సౌకర్యాన్ని పెంచుతూ సింహాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
రైలు ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు దక్షిణ కోస్తా రైల్వే (SCoR) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం ప్రయాణికుల రద్దీతో నడిచే ప్రతిష్టాత్మక సింహాద్రి ఎక్స్‌ప్రెస్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను సాంప్రదాయ ఐసీఎఫ్ (ICF) కోచ్‌ల నుంచి అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ (Linke Hoffmann Busch) కోచ్‌లుగా మార్చనున్నారు. ఈ ఆధునీకరణ ప్రక్రియ జూన్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు విజయవాడ డివిజన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్త కోచ్‌లతో నడిచే రైళ్లు -షెడ్యూల్ వివరాలు :
- రైలు నంబర్ 12747 (గుంటూరు - వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్): జూన్ 22, 2026 నుంచి కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది.
- రైలు నంబర్ 12748 (వికారాబాద్ - గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్): జూన్ 22, 2026 నుంచి ఆధునిక కోచ్‌లతో సేవలు అందిస్తుంది.
- రైలు నంబర్ 17239 (గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్): జూన్ 23, 2026 నుంచి సరికొత్త కోచ్‌లతో ప్రయాణికులను చేరవేస్తుంది.
- రైలు నంబర్ 17240 (విశాఖపట్నం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్): జూన్ 24, 2026 నుంచి ఎల్‌హెచ్‌బీ బోగీలతో పట్టాలెక్కనుంది.
కొత్త కోచ్‌ల అమరిక పరిశీలిస్తే…. వీటిలో ఒక ఏసీ 3-టైర్ కోచ్, ఒక ఏసీ చైర్ కార్, ఆరు సెకండ్ క్లాస్ చైర్ కార్లు, పది జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, ఒక జనరేటర్ వ్యాన్, మరియు ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/బ్రేక్ వ్యాన్ అందుబాటులో ఉంటాయి.
ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు:
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే భారతీయ రైల్వే సంకల్పంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే సేవల నాణ్యతను పెంచడంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.
- ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ ఉండటం వల్ల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ప్రయాణికులకు ఎలాంటి కుదుపులు, శబ్దాలు లేకుండా నిశ్శబ్ద వాతావరణం లభిస్తుంది.
- ఈ కోచ్‌లలో గాలి వెలుతురు బాగా వచ్చేలా ఆధునిక వెంటిలేషన్ సిస్టమ్, ఎర్గోనామిక్ పద్ధతిలో డిజైన్ చేసిన సీట్లు, బర్త్‌లు, ఆధునిక ఫిట్టింగ్స్‌తో కూడిన అందమైన ఇంటీరియర్స్ ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.
- ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా ఉండేలా యాంటీ-టెలిస్కోపిక్ (యాంటీ-క్లైంబింగ్) సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణనష్టం జరిగే అవకాశం చాలా వరకు తప్పుతుంది.
- ఇందులో ఏర్పాటు చేసిన సుపీరియర్ న్యూమాటిక్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల రైలును అత్యంత వేగంగా వెళ్తున్నప్పుడు కూడా తక్కువ దూరంలోనే సురక్షితంగా ఆపవచ్చు.
- పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఎల్‌హెచ్‌బీ బోగీలు బరువు తక్కువగా ఉండి, మరింత దృఢంగా ఉంటాయి. ఫలితంగా ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా రైలు పట్టాలపై ఒత్తిడి తగ్గి అరుగుదల తగ్గుతుంది. వీటికి తరచుగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి దీర్ఘకాలంలో ఇవి ఎంతో లాభదాయకంగా మారుతాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

