Palasa Vijayawada Janasadharan Trains : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు హాజరయ్యే అభ్యర్థులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. పరీక్షల వేళ అభ్యర్థులు, ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు విజయవాడ డివిజన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలాసా - విజయవాడ స్టేషన్ల మధ్య అన్‌రిజర్వ్‌డ్ జనసాధారణ్ స్పెషల్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 10 జనరల్ క్లాస్ కోచ్‌లతో పాటు 2 ఎస్‌ఎల్‌ఆర్ (SLR) కోచ్‌లతో కలిపి మొత్తం 12 ఐసిఎఫ్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయి.
రైళ్ల షెడ్యూల్ :
- రైలు నంబర్ 07067 (పలాసా - విజయవాడ స్పెషల్): ఈ రైలు 02.08.2026 నుం;f 05.08.2026 వరకు ప్రతిరోజూ పలాసా నుంచి బయలుదేరి 4 ట్రిప్పులు నడుస్తుంది. పలాసాలో మధ్యాహ్నం 14:00 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు అర్ధరాత్రి 01:00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07068 (విజయవాడ - పలాసా స్పెషల్) : ఈ రైలు 03.08.2026 నుం'f 06.08.2026 వరకు ప్రతిరోజూ విజయవాడ నుంచి బయలుదేరి 4 ట్రిప్పులు నడుస్తుంది. విజయవాడలో సాయంత్రం 16:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 04:30 గంటలకు పలాసా చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. రెండు మార్గాల్లో నిలిచే ప్రధాన స్టేషన్లు, వాటి సమయాలు క్రింది విధంగా ఉన్నాయి..
- శ్రీకాకుళం రోడ్ : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 14:50/14:52 గంటలకు; తిరుగు ప్రయాణంలో 02:43/02:45 గంటలకు చేరుకుంటుంది.
- విజయనగరం : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 15:43/15:45 గంటలకు; తిరుగు ప్రయాణంలో 01:48/01:50 గంటలకు నిలుస్తుంది.
- సింహాచలం : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 16:28/16:30 గంటలకు; తిరుగు ప్రయాణంలో 01:08/01:10 గంటలకు చేరుకుంటుంది.
- విశాఖపట్నం : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 17:50/18:10 గంటలకు; తిరుగు ప్రయాణంలో 00:30/00:50 గంటలకు అందుబాటులో ఉంటుంది.
- దువ్వాడ : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 18:40/18:42 గంటలకు; తిరుగు ప్రయాణంలో 23:35/23:37 గంటలకు చేరుకుంటుంది.
- తుని: పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 19:42/19:44 గంటలకు; తిరుగు ప్రయాణంలో 21:33/21:35 గంటలకు అందుబాటులో ఉంటుంది.
- సామర్లకోట : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 20:22/20:24 గంటలకు; తిరుగు ప్రయాణంలో 20:55/20:57 గంటలకు చేరుకుంటుంది.
- రాజమండ్రి : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 21:15/21:20 గంటలకు; తిరుగు ప్రయాణంలో 20:10/20:15 గంటలకు నిలుస్తుంది.
- ఏలూరు : పలాసా నుంచి విజయవాడ వెళ్లే రైలు 22:38/22:40 గంటలకు; తిరుగు ప్రయాణంలో 17:45/17:47 గంటలకు అందుబాటులో ఉంటుంది.