SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్... వరంగల్, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు!
South Central Railway Special Trains 2026 : రానున్న ఆగస్టు నెలలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాన్పూర్ సెంట్రల్ - మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
South Central Railway Special Trains 2026 : తెలుగు రాష్ట్రాల మీదుగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రాబోయే ఆగస్టు నెలలో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు కాన్పూర్ సెంట్రల్ నుంచి తమిళనాడులోని మధురై మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కీలకమైన రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి ప్రధాన నగరాలు, పట్టణాల మీదుగా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉత్తరాది, దక్షినాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే భక్తులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది.
రైళ్ల వివరాలు… వేళలు:
కాన్పూర్ సెంట్రల్ - మధురై స్పెషల్ (ట్రైన్ నంబర్ 01925) :
- ఈ ప్రత్యేక రైలు కాన్పూర్ సెంట్రల్‌లో బుధవారం ఉదయం 08:10 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 07:15 గంటలకు మధురై చేరుకుంటుంది.
- ఆగస్టు నెలలో ఈ రైలు 05.08.2026, 12.08.2026, 19.08.2026 మరియు 26.08.2026 తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది (మొత్తం 4 సర్వీసులు).
మధురై - కాన్పూర్ సెంట్రల్ స్పెషల్ (ట్రైన్ నంబర్ 01926) :
- తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధురైలో శనివారం తెల్లవారుజామున 02:30 గంటలకు బయలుదేరి, సోమవారం ఉదయం 04:30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది.
- ఈ సర్వీసు ఆగస్టు నెలలో 08.08.2026, 15.08.2026, 22.08.2026 మరియు 29.08.2026 తేదీలలో నడుస్తుంది (మొత్తం 4 సర్వీసులు).
హాల్ట్ స్టేషన్లు…
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా పోఖ్రాయాన్, ఒరాయ్, వీరంగాన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రాపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, నామక్కల్, కరూర్ మరియు దిండిగల్ స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2-టైర్ (2AC), ఏసీ 3-టైర్ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

