ఏపీ : స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు - తప్పకుండా అప్డేట్ చేసుకోండి..!
రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈనెల 6వ తేదీ వరకు వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులు… ఈనెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

ఇదే నెలలో మరో విడత కూడా…
15 నుంచి 17 ఏళ్ల మధ్య వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవడానికి వీలుగా ఈ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. అలాగే ఈ నెల 16 నుంచి 20 వరకు మరో విడత కూడా…. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత నాలుగేళ్లుగా మారు మూల ప్రాంతాల్లోనూ ఆధార్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఇంకా చాలా మంది పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ ఆప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక పిల్లల ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ కు సంబధిత పత్రాలను తీసుకెళ్లాలి. అంతేకాకుండా దరఖాస్తు ఫారం ఉండాలి.
పిల్లలను తల్లి లేదా తండ్రి మాత్రమే ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి. చిన్నారులను ఆధార్ సెంటర్‌కు తీసుకెళ్లే వారి (తల్లి లేదా తండ్రి) ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇక్కడ పిల్లల ఫోటో, ఫింగర్ ప్రింట్, ఐరిస్ అప్ డేట్ అవుతాయి. ఆధార్ లో మీ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేయాల్సి వస్తే సరిచేసుకునే వీలు ఉంటుంది.
బాల్యంలో ఆధార్ జారీ చేసేటప్పుడు… పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటో వంటి వివరాలను మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలో వారి బయోమెట్రిక్ సమాచారం పూర్తిగా అందుబాటులోకి రాదు. పాఠశాల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షలు, ఉపకార వేతనాలు, డీబీటీ వంటి సేవలలో పిల్లలకు ఇది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బయోమెట్రిక్ అప్డేట్ అవసరం. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

