...
...
Next Story

టీటీడీ జూనియర్ కళాశాలల్లో జూలై 23, 24 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు

టీటీడీ జూనియర్ కళాశాలల్లో జూలై 23, 24 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకే అవకాశం ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

Published on: Jul 17, 2026, 14:45:57 IST
Advertisement

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జూలై 23, 24 తేదీల్లో మెరిట్ ఆధారంగా ఆఫ్‌లైన్ విధానంలో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయని అభ్యర్థులకు ప్రవేశానికి అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

స్పాట్ అడ్మిషన్లకు టీటీడీ ఉద్యోగుల పిల్లలు, టీటీడీ ఎస్‌వీ బాలమందిర్ విద్యార్థులు, మొదటి నుంచి ఆరో దశ కౌన్సెలింగ్ వరకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు, తిరుపతి స్థానికులు, స్థానికేతర అభ్యర్థులు అర్హులు.

కౌన్సెలింగ్ షెడ్యూల్

జూలై 23 ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు: 550–600 మార్కులు సాధించిన అభ్యర్థులకు ఉంటుంది. మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు: 500–549 మార్కులు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది.

జూలై 24న ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు 450-499 మార్కులు సాధించిన అభ్యర్థులకు ఉండగా.. మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు 400–449 మార్కులు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

అర్హులైన విద్యార్థులు అవసరమైన ఒరిజినల్ ధృవపత్రాలు, సంబంధిత పత్రాలతో నిర్ణీత తేదీలు, సమయాలకు సంబంధిత కళాశాలలకు హాజరై స్పాట్ అడ్మిషన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe