...
...
Next Story

AP MPTC ZPTC Election Results 2026 : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలు విడుదల - పార్టీల వారీగా లిస్ట్ ఇదే

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. టీడీపీ, వైసీ, జనసేన, భాజపాలు సాధించిన స్థానాల పూర్తి వివరాలను పేర్కొంది. తెలుగుదేశం పార్టీ అత్యధికంగా 406 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది.

Published on: Nov 9, 2026, 05:12:41 IST
Advertisement

AP MPTC ZPTC Election Results 2026 : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పోరులో అధికార కూటమి ప్రభంజనం సృష్టించింది. ఇటీవల నిర్వహించిన పరిషత్‌ (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలకు సంబంధించిన తుది ఓట్ల లెక్కింపు ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం అధికారికంగా విడుదల చేసింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం (Gemini AI Generated Image)
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం (Gemini AI Generated Image)

రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగియడంతో పార్టీల వారీగా విజేతల వివరాలను ఈసీ వెల్లడించింది. జెడ్పీటీసీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.

రాష్ట్రంలో మొత్తం 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించగా, తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇక ప్రతిపక్ష వైసీపీ 76 స్థానాలను గెలుచుకుంది. ఇక కూటమిలో భాగమైన జనసేన పార్టీ… 73 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పాగా వేసింది.

  • తెలుగుదేశం పార్టీ : 406 స్థానాలు
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP): 76 స్థానాలు
  • జనసేన పార్టీ: 73 స్థానాలు
  • భారతీయ జనతా పార్టీ: 20 స్థానాలు
  • స్వతంత్రులు: 06 స్థానాలు
  • సీపీఐ (ఎం): 01 స్థానం

ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి జోరు..

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరిగిన 7,768 ఎంపీటీసీ స్థానాల్లోనూ అధికార పార్టీలు తమ బలాన్ని నిరూపించుకున్నాయి. తెలుగుదేశం పార్టీ 4 వేలకుపైగా స్థానాలను గెలుచుకోగా… ప్రతిపక్ష వైసీపీ 1711 స్థానాలను కైవసం చేసుకుంది.

  • తెలుగుదేశం పార్టీ: 4,806 స్థానాలు
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 1,711 స్థానాలు
  • జనసేన పార్టీ: 938 స్థానాలు
  • భారతీయ జనతా పార్టీ: 117 స్థానాలు
  • స్వతంత్రులు: 169 స్థానాలు
  • సీపీఐ (ఎం): 15 స్థానాలు
  • కాంగ్రెస్ పార్టీ: 09 స్థానాలు
  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP): 03 స్థానాలు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks