ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)ను దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. బుధవారం సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడారు. రూ.10.65 కోట్లతో 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామన్నారు. ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశ మందిరం ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా రూ.4 కోట్ల 40 లక్షల వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచి ఉండేందుకు వీలుగా విశ్రాంతి భవనంలో అదనపు అంతస్తులను ప్రారంభించినట్టు తెలిపారు.
ఇందులో రోగుల సహాయకులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు మరుగుదొడ్లు, లిఫ్టులు ఏర్పాటు చేసినట్టు బీఆర్ నాయుడు వివరించారు. ఈ సందర్భంగా ఈ రెండు భవనాలలో కల్పించిన సౌకర్యాల గురించి స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ ఛైర్మన్‌కు వివరించారు.
టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్‌లో పలు భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసినట్టు ఆర్వీ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగానే సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను నిర్మించినట్టు చెప్పారు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్‌లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆర్వీ కుమార్ పేర్కొన్నారు.
{{/usCountry}}శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆర్వీ కుమార్ పేర్కొన్నారు.
{{/usCountry}}'ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టాం. ఇందులో భాగంగా స్విమ్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏడాది క్రితం 150 గదులతో హాస్టల్ భవనాలు ప్రారంభించాం. రెండో దశలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించాం. అతి త్వరలోనే టీటీడీ సహకారంతో స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచన్, 350 అదనపు పడకలు, 5 ఆపరేషన్ థియేటర్లు, 5 ఐసీయూలతో అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ సెంటర్ భవనాలను అందుబాటులోకి తీసుకొస్తాం.' అని స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ వెల్లడించారు.