తెలుగు ప్రయాణికులకు శుభవార్త - ఈ 3 స్పెషల్ రైళ్లు ఇక రెగ్యులర్ సర్వీసులుగా మార్పు, ఇవిగో వివరాలు

హైదరాబాద్  మీదుగా నడిచే మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చారు. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లు… ఏపీలోని రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్తాయి.

Published on: Mar 13, 2026 3:32 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెరుగుతున్న జనాభా, ఆయా మార్గాలలో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వేశాఖ…. నూతన రైలు సర్వీసులను ప్రారంభిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు గత 12 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా రైల్వేశాఖ 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించింది. ఈ రైళ్లన్నీ కూడా జంట నగరాల పరిధిలోని రైల్వేస్టేషన్ల నుంచే (హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి టర్మినల్) ప్రారంభమవుతున్నాయి.

ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త

రెగ్యులర్ ట్రైన్స్‌గా మార్పు…

కొత్త సర్వీసుల ప్రారంభంతో పాటుగా.. ఇప్పటికే నడుస్తున్న రైలు సర్వీసుల్లో.. పాత కోచ్ లను ఆధునీకరించి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి కూడా భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్ కు అనుగుణంగా సేవలు అందిస్తున్న మూడు స్పెషల్ ట్రైన్స్‌ను.. రెగ్యులర్ ట్రైన్స్‌గా మారుస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏపీ, తెలగాణ ప్రజలకు మేలు జరగనుంది.

● రైలు నెంబర్ 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ ప్రెస్(రైలు నం. 17165/17616) గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

ఈ రైలు రెండు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.

● హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలు(రైలు నం. 07230/07229)ను హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్(రైలు నం. 17069/17070) గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.

● చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలు(రైలు నం. 07225/07226)ను చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్(రైలు నం. 17065/17066) గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ రైలు కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం…

3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ భారతీయ రైల్వే తీసుకు నిర్ణయం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోదీ, రైల్వే శాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 36,286 కోట్ల రైల్వే బడ్జెట్ ను కేటాయించారని… ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 47,984 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, రూ. 2,668 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 రైల్వేస్టేషన్లను అధునాతన సౌకర్యాలతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు తద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశారు.

ఇటీవలే దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను మంజూరు చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లు తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో కీలకం కానున్నాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 5 వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయని వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More