...
...
Next Story

పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. టీటీడీకి అనేక ప్రశ్నలు!

పరకామణి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వివరణ కోరింది.

Published on: Jan 6, 2026, 15:34:55 IST
Advertisement

తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఆలయ బోర్డు సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానా(టీటీడీ)నికి అనేక ప్రశ్నలు సంధించింది. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు నివేదికలో లేవని కోర్టు గమనించింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

లుంగీలు ధరించి కౌంటింగ్ ప్రాంతంలోకి సిబ్బందిని అనుమతించే బదులు తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడాన్ని కూడా ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా, బోర్డును సంప్రదించిన తర్వాత సంబంధిత వివరాలను సమర్పిస్తామని టీటీడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో బాధ్యులుగా తేలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది.

ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని పేర్కొంది.

నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్టుగా సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు పేర్కొంది. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చోరీ కేసు మినహా సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాల మీద దర్యాప్తు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. తర్వాత విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe