తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుని నర్తన రూపం భక్తులను పరవశింపజేసింది.

చంద్రుని చల్లని వెన్నెల ప్రకృతికి ఆహ్లాదాన్ని, మనసుకు ప్రశాంతతను అందించినట్లే, చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీవారి దివ్యమంగళ రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. పరమశివుని శిరోభూషణంగా చంద్రుడు విరాజిల్లుతుండగా, శ్రీమహావిష్ణువు వాహనంగా చంద్రప్రభ వెలుగొందడం హరిహర తత్త్వ సమన్వయాన్ని స్ఫురింపజేసే విశిష్ట ఆధ్యాత్మిక విశేషం.
నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీవారి దర్శనం భగవంతుని దివ్యలీలలను స్మరింపజేసింది. చంద్రుని శీతల కాంతులు, శ్రీకృష్ణుని లీలామాధుర్యం, శ్రీవారి దివ్య తేజస్సు మేళవించిన ఈ వాహనసేవ తిరుమలలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేసింది. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
పుష్పాలంకరణలకు విశేష ప్రశంసలు
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో చేపట్టిన పుష్పాలంకరణలకు భక్తుల నుండి విశేష ప్రశంసలు వచ్చాయని టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలియజేశారు. తిరుమలలోని రామ్ భగీచా-2లోని మీడియా సెంటర్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో పుష్పాలంకరణలు చేపట్టేందుకు దాదాపు 30 మంది దాతలు ముందుకువచ్చారని, వారి సహకారం, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, ఉద్యానవన సిబ్బంది కృషితో తిరుమలలో అత్యంత శోభాయమానంగా పుష్పాలంకరణలు చేపట్టామని చెప్పారు. దాదాపు 60 టన్నుల పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయం వద్ద బ్రహ్మోత్సవాల తొలిరోజు, గరుడసేవ రోజు, ఏడో రోజు పుష్పాలంకరణలు మార్చడం జరిగిందని తెలిపారు.
జీఎన్సీ వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్న పిల్లలకు పురాణాలపై ఆసక్తి కలిగేలా 24 రకాల కాన్సెప్ట్లతో పుష్పాలంకరణలు చేపట్టినట్లు తెలియజేశారు.
{{/usCountry}}జీఎన్సీ వద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంకణ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్న పిల్లలకు పురాణాలపై ఆసక్తి కలిగేలా 24 రకాల కాన్సెప్ట్లతో పుష్పాలంకరణలు చేపట్టినట్లు తెలియజేశారు.
{{/usCountry}}భవిష్యత్తులో ఏఐ సహకారంతో తిరుమలలో ఉద్యానవనాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. తిరుమలలో 34 ఉద్యానవనాలు ఉన్నాయనీ, 20 ఉద్యానవనాలను దాతలు నిర్వహిస్తుండగా, 14 ఉద్యానవానాలను టీటీడీ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఉద్యానవనాలను నిర్వహణలో ఏఐ భాగస్వామ్యంతో మరింత అందంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు.