...
...
Next Story

Tirumala Garuda Seva : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - గరుడసేవ రోజు ఉదయం 3 నుంచే పుష్కరిణిలోకి అనుమతి!

Tirumala Brahmotsavam Garuda Seva : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 19న జరిగే గరుడసేవను పురస్కరించుకుని భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 3 గంటల నుంచే స్వామి పుష్కరిణిలోకి అనుమతించనుంది.

Published on: Sep 18, 2026, 13:01:16 IST
Advertisement

Tirumala Brahmotsavam Garuda Seva : తిరుమల క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన గరుడసేవకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన జరగనున్న గరుడసేవ రోజున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ… ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఉదయం 3 గంటల నుంచే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉదయం 3 గంటల నుంచే…

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026

సాధారణ రోజుల్లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత పవిత్రంగా భావించే గరుడసేవ నాడు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ఈ క్రమంలో పుష్కరిణి వద్ద భక్తుల క్యూలైన్లు పెరిగి ఎలాంటి తొక్కిసలాట లేదా అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మూడు గంటల ముందే… అంటే ఉదయం 3 గంటలకే పుష్కరిణి ద్వారాలను తెరవాలని టీటీడీ నిర్ణయించింది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడం మహా పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. గరుడసేవ వేళ భక్తుల రాకను సమర్థవంతంగా నియంత్రించేందుకు, ప్రతి ఒక్కరికీ సురక్షితంగా పుష్కరిణి స్నాన భాగ్యం కల్పించేందుకు ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, సెక్యూరిటీ విభాగాలు ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. భక్తులు టీటీడీ సిబ్బంది సూచనలను పాటించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు…

మరోవైపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన శుక్రవారం(ఇవాళ) ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks