తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... ఈనెల 21న వ‌స్త్రాల ఈ-వేలం, ఇలా పాల్గొనొచ్చు

తిరుమల శ్రీవారితో పాటు ఇతర ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్తాల ఈ-వేలానికి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 21 నుంచి 23 వరకు ఈ ప్రక్రియను నిర్వహించనుంది.

Published on: Sep 13, 2026, 12:47:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులు మొక్కుబడుల రూపంలో సమర్పించిన కానుకల వేలానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ పరిధిలోని ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన వస్త్రాలను ఈ-వేలం (E-Auction) ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ఈనెల 21న ఈ-వేలం…

వేలం ప్రక్రియ సెప్టెంబరు 21వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబరు 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగుతుంది. ఈ సారి వేలంలో ప్రధానంగా కొత్తవి అయిన ఆర్ట్ సిల్క్ చీరలను ఉంచారు. మొత్తం 132 లాట్లుగా వీటిని విభజించి ఆన్‌లైన్ వేలానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యాపారులు, భక్తులు, సాధారణ ప్రజలు ఈ-వేలంలో పాల్గొని తమకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు.

ఈ-వేలానికి సంబంధించిన మరింత సమాచారం, నిబంధనలు తెలుసుకోవాలనుకునే వారు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) ఫోన్ నంబరు 0877-2264429ను నేరుగా సంప్రదించవచ్చు. అలాగే వేలంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ www.konugolu.ap.govt.in లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org ని సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు.

శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు :

తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 14న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు.

రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8 గంట‌లకు మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More