Tirumala Robot Dog : తిరుమల గిరుల్లో ఆధ్యాత్మిక యాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, భక్తులకు పూర్తి రక్షణ కల్పించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యంత వినూత్నమైన క్వాడ్రుపెడ్ రోబోట్ (నాలుగు కాళ్ల రోబోట్ డాగ్) పనితీరును గురువారం తిరుమలలో పరిశీలించారు.

తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ రోబోట్ డాగ్ ట్రయల్ రన్‌ను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణంగా అడవుల్లో మనుషులు వెళ్లడానికి వీలుకాని, ప్రమాదకరమైన ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను ముందస్తుగా కనిపెట్టేందుకు ఈ రోబోట్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపై సాంకేతిక నిపుణుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అత్యాధునిక సాంకేతికతల సమాహారం……
ఈ రోబోట్ డాగ్‌లో అత్యంత క్లిష్టమైన వాతావరణంలోనూ పనిచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. ఇందులో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్ (LiDAR), వివిధ రకాల సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిస్టమ్‌లు ఉన్నాయి. దట్టమైన చీకటి లేదా పొగమంచు ఆవరించి ఉన్నప్పటికీ వన్యప్రాణుల సంచారాన్ని ఇది కచ్చితత్వంతో గుర్తుపట్టగలదు.
ఈ రోబోట్‌లోని ఏఐ వ్యవస్థ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పశువులను స్పష్టంగా గుర్తించి వర్గీకరించగలదని అధికారులు వెల్లడించారు. ఏదైనా వన్యప్రాణి సంచారాన్ని గుర్తించిన వెంటనే, ఈ రోబోట్ జియో - ట్యాగ్‌డ్ అలర్ట్‌లను పంపడమే కాకుండా, లైవ్ వీడియో ఫీడ్ మరియు థర్మల్ చిత్రాలను నేరుగా కంట్రోల్ రూమ్‌తో పాటు క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ చేసే సిబ్బందికి చేరవేస్తుంది.
ముఖ్యంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాట మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర క్రూర మృగాల కదలికలను ముందస్తుగా గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. క్రూర జంతువులు భక్తులు నడిచే బాటల వైపు వచ్చినప్పుడు, రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి ఎలాంటి భౌతిక తాకిడి లేకుండానే వాటిని తిరిగి అడవిలోకి మళ్లించే వీలుంది. దీనివల్ల భక్తులను ముందుగానే అప్రమత్తం చేయడంతో పాటు మనుషులు, వన్యప్రాణుల మధ్య జరిగే ముఖాముఖి ఘర్షణలను అరికట్టవచ్చు.
{{/usCountry}}ముఖ్యంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలిబాట మార్గానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర క్రూర మృగాల కదలికలను ముందస్తుగా గుర్తించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. క్రూర జంతువులు భక్తులు నడిచే బాటల వైపు వచ్చినప్పుడు, రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి ఎలాంటి భౌతిక తాకిడి లేకుండానే వాటిని తిరిగి అడవిలోకి మళ్లించే వీలుంది. దీనివల్ల భక్తులను ముందుగానే అప్రమత్తం చేయడంతో పాటు మనుషులు, వన్యప్రాణుల మధ్య జరిగే ముఖాముఖి ఘర్షణలను అరికట్టవచ్చు.
{{/usCountry}}ఇప్పటికే తిరుమల కొండలపై అందుబాటులో ఉన్న కెమెరా ట్రాప్‌లు, ఫుట్ పెట్రోలింగ్, విజిలెన్స్ నిఘా వ్యవస్థలకు ఇది ఒక శక్తివంతమైన మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా అదనపు బలాన్ని ఇస్తుందని అదనపు ఈవో వెల్లడించారు. జంతువుల సంచారం ఎక్కువగా ఉండే సున్నితమైన ప్రాంతాల్లో దీనిని అత్యంత వేగంగా మోహరించవచ్చు. దీని ద్వారా సేకరించిన థర్మల్ చిత్రాలు, వీడియోలను విశ్లేషించి వన్యప్రాణుల సంచార విధానాన్ని అర్థం చేసుకోవడానికి… తద్వారా నిఘా సమయాలను మెరుగుపరచడానికి వీలవుతుంది.