తిరుపతి విమానాశ్రయం (రేణిగుంట) ద్వారా ప్రయాణించే భక్తులు, ఇతర ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు కీలక విజ్ఞప్తి చేశారు. పలు ప్రముఖ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న సర్వీసుల వేళల్లో సవరణలు చేసినట్లు విమానాశ్రయ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నూతన టైమ్‌టేబుల్ సెప్టెంబరు 1, 2026 అమలులోకి వస్తుందని వెల్లడించారు. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇండిగో సర్వీసులు

ఇండిగో సంస్థకు చెందిన పలు సర్వీసుల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో మార్పులు జరిగాయి.
హైదరాబాద్ - తిరుపతి : ఉదయం 7:20 గంటలకు తిరుపతి చేరుకుని, తిరిగి ఉదయం 8:00 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది.
హైదరాబాద్ - తిరుపతి : ఉదయం 11:15 గంటలకు వచ్చి, తిరిగి 11:45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.
హైదరాబాద్ - తిరుపతి : మధ్యాహ్నం 1:50 గంటలకు ల్యాండ్ అయి, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.
విశాఖపట్నం - తిరుపతి: మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతి చేరుకుని, తిరిగి సాయంత్రం 4:00 గంటలకు వైజాగ్ వైపు బయలుదేరుతుంది.
ఢిల్లీ - తిరుపతి: సాయంత్రం 6:25 గంటలకు వచ్చి, తిరిగి రాత్రి 7:05 గంటలకు దేశ రాజధానికి తిరుగు ప్రయాణమవుతుంది.
హైదరాబాద్ - తిరుపతి : రాత్రి 8:20 గంటలకు తిరుపతి చేరుకుని, రాత్రి 9:00 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
స్టార్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా సర్వీసులు
ఇండిగోతో పాటు స్టార్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా సంస్థల సర్వీసుల సమయాలు కూడా సవరించాయి.
స్టార్ ఎయిర్‌లైన్స్ (శివమొగ్గ - తిరుపతి - హైదరాబాద్): ఈ విమానం కర్ణాటకలోని శివమొగ్గ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ మార్గంలో బయలుదేరుతుంది.
{{/usCountry}}స్టార్ ఎయిర్‌లైన్స్ (శివమొగ్గ - తిరుపతి - హైదరాబాద్): ఈ విమానం కర్ణాటకలోని శివమొగ్గ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఆ తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ మార్గంలో బయలుదేరుతుంది.
{{/usCountry}}ఎయిర్ ఇండియా (హైదరాబాద్ - తిరుపతి): సాయంత్రం 5:10 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్‌కు ప్రయాణమవుతుంది.
విమాన సమయాల్లో మార్పులు జరిగిన దృష్ట్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణికులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. బోర్డింగ్ పాస్‌లు పొందడం, సెక్యూరిటీ చెకింగ్ ప్రక్రియల్లో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రయాణికులు విమాన సమయానికి కనీసం 2 గంటల ముందే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని సూచించింది. సంబంధిత విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా ప్రయాణానికి ముందే విమాన స్టేటస్‌ను సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.