...
...
Next Story

విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం.. మరో ప్రొఫెసర్ వీడియో రికార్డింగ్!

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగిక దాడి కేసుపై హోం మంత్రి అనిత స్పందించారు. విద్యార్థికి న్యాయం చేస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు.

Published on: Dec 8, 2025, 16:20:11 IST
Advertisement

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగిక దాడి కేసుపై హోం మంత్రి అని మాట్లాడారు. తిరుపతి ఎస్పీ, పోలీస్ ఉన్నతాథికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. పోలీసులు వెంటనే ఫిర్యాదు తీసుకున్నారని చెప్పారు. తిరుపతి ఎస్పీ పర్సనల్‌గా పర్యవేక్షిస్తున్నారని హోంమంత్రి వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ కోసం ఒడిశాకు కూడా పోలీసులు బృందం వెళ్లిందన్నారు. విద్యార్థికి న్యాయం చేస్తామని, ఎవ్వరిని ఉపేక్షించేది లేదన్నారు. మహిళల రక్షణే మా లక్ష్యం అని హోం మంత్రి అనిత తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ కేసులో ఒడిశాకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో బి.ఎడ్ చదువుతోంది. ఆ యువతిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా వేధించి గర్భవతిని చేశాడు. లక్ష్మణ్ కుమార్ లైంగిక దాడికి పాల్పడగా.. మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి ఫోన్లో రికార్డు కూడా చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా తనను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి ప్రయత్నిస్తున్నాడని కూడా విద్యార్థిని చెప్పుకొచ్చింది.

విద్యార్థిని తన లిఖితపూర్వక ఫిర్యాదులో తనను నిరంతరం ప్రొఫెసర్లు లైంగిక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఆమె నవంబర్ 24న వర్సిటీ లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి, హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు సమర్పించింది. సాక్ష్యంగా వాట్సాప్ సంభాషణల స్క్రీన్‌షాట్‌లను కూడా ఇచ్చింది. తన తల్లిదండ్రులకు తన పరిస్థితి తెలిసిందని, చదువును ఆపివేసి రమ్మన్నారని చెప్పింది. ఆ ఇద్దరు అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీకి విజ్ఞప్తి చేసి, టీసీ అడిగి స్వస్థలానికి తిరిగి వెళ్లింది.

విచారణ నిర్వహించడానికి విశ్వవిద్యాలయం నలుగురు సభ్యుల అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. ఫిర్యాదును దర్యాప్తు కోసం పోలీసులకు నివేదించాలని సిఫార్సు చేసింది. ఆ కమిటీ ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది. వర్సిటీ వీసీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి పోలీసులు లక్ష్మణ్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అప్పటికే లక్ష్మణ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe