...
...
Next Story

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - నవంబర్ నెలలోని విశేష పర్వదినాలివే, 8న దీపావళి ఆస్థానం

నవంబర్ లో తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. నవంబర్ 8వ తేదిన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఉంటుంది.

Published on: Oct 27, 2026, 13:29:31 IST
Advertisement

కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో రాబోయే నవంబర్ నెలలో అనేక విశేష పర్వదినాలు, వైభవోపేతమైన వేడుకలు జరగనున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు సాగే వివిధ ఉత్సవాలు, ఆళ్వార్లు మరియు పీఠాధిపతుల వర్ష తిరు నక్షత్రాలు (తిరునక్షత్ర ఉత్సవాలు), చక్రతీర్థ ముక్కోటి, పుష్పయాగం వంటి కీలక పూజా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ఈ ఏడాది నవంబర్ మాసంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే ముఖ్యమైన పూజలు, ఆస్థానాలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల పూర్తి వివరాలను భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులు తమ తిరుమల యాత్రను, శ్రీవారి దర్శనాలను ప్రణాళికాబద్ధంగా చేసుకునేందుకు ఈ పర్వదినాల జాబితా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

నవంబరులో జరిగే విశేష పర్వదినాలు :

  • నవంబర్ 2వ తేదీన తిరుమల నంబి ఉత్సవారంభం.
  • నవంబర్ 4న శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం.
  • నవంబర్ 8వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.
  • నవంబర్ 11వ తేదీన తిరుమల నంబి శాత్తుమొర.
  • నవంబర్ 13వ తేదిన నాగుల చవితి, తిరుమల శ్రీవారి పెద్దశేష వాహనం, శ్రీమనవాళ మహామునుల శాత్తుమొర.
  • నవంబర్ 14న సేనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 15న శ్రీవారి పుష్ప యాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 16న శ్రీవారి పుష్ప యాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లై లోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయ్ గై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • నవంబర్ 19 వ తేదీన యాజ్ఞవల్క్య జయంతి.
  • నవంబర్ 21వ తేదీన కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.
  • నవంబర్ 24వ తేదీన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
  • నవంబర్ 25వ తేదీన తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks