TTD Summer Arrangements : వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎండల తీవ్రత, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాత్రికుల కోసం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేపట్టింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…. దర్శనం కోసం వేచి ఉండే సమయంలో అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలను టీటీడీ సమన్వయం చేస్తోంది.
రూ. 2 కోట్లతో ఇంజినీరింగ్ పనులు…

ఎండ తీవ్రత నుంచి భక్తులను రక్షించేందుకు టీటీడీ ఇంజినీరింగ్ విభాగం సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక పనులు చేపట్టింది. బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎండ తగలకుండా భారీ చలువ పందిళ్లను నిర్మించారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు షెల్టర్లను అందుబాటులోకి తెచ్చారు.
ముఖ్యంగా భక్తులు చెప్పులు లేకుండా నడిచే నాలుగు మాడ వీధుల్లో పాదాలు కాలకుండా ఉండేందుకు టీటీడీ 'సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్' వేయించింది. లడ్డూ కౌంటర్లు, ఆలయ పరిసరాల్లోనూ చలువ పందిళ్లు నిర్మించి భక్తులకు ఉపశమనం కల్పిస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే చోట తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు.
తాగునీరు.. వైద్య సేవలు
వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు అందించేందుకు టీటీడీ ఆరోగ్య విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. శ్రీవారి సేవకులు మొబైల్ వాటర్ డ్రమ్ములతో నేరుగా భక్తుల వద్దకే వెళ్లి నీరు అందిస్తున్నారు. రోజుకు మూడు బ్యాచుల్లో 45 మంది సేవకులు నిరంతరం ఈ సేవలో పాల్గొంటున్నారు. క్యూ లైన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తున్నారు.
మరోవైపు భక్తుల ఆరోగ్యం కోసం తిరుమల వ్యాప్తంగా 16 వైద్య కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి, నారాయణగిరి వద్ద మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
లడ్డూల బఫర్ స్టాక్.. వసతి ఏర్పాట్లు
{{/usCountry}}మరోవైపు భక్తుల ఆరోగ్యం కోసం తిరుమల వ్యాప్తంగా 16 వైద్య కేంద్రాలను సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి, నారాయణగిరి వద్ద మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
లడ్డూల బఫర్ స్టాక్.. వసతి ఏర్పాట్లు
{{/usCountry}}భక్తులకు ప్రసాదం విషయంలో ఎలాంటి లోటు రాకుండా టీటీడీ జాగ్రత్త వహించింది. సాధారణంగా రోజుకు 3.50 లక్షల లడ్డూలను తయారు చేస్తుండగా, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను 'బఫర్ స్టాక్'గా ఉంచారు.
వసతి విషయానికి వస్తే…. తిరుమలలో ఉన్న 7500 గదులు మరియు ఐదు యాత్రికుల వసతి సముదాయాల ద్వారా సుమారు 60 వేల మందికి వసతి కల్పించే వీలుంది. గదులు దొరకని భక్తుల కోసం వివిధ పీఏసీలలో దాదాపు 9 వేల లాకర్లను అందుబాటులో ఉంచారు. అయితే కుటుంబ సభ్యులతో వచ్చే వారికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఒంటరిగా వచ్చే భక్తులకు గదుల కేటాయింపు ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.
మొక్కులు తీర్చుకునే భక్తుల కోసం ప్రధాన కల్యాణకట్టతో పాటు మరో 11 మినీ కల్యాణకట్టలను టీటీడీ నిర్వహిస్తోంది. మొత్తం 1152 మంది క్షురకులు (వీరిలో 269 మంది మహిళలు) భక్తులకు సేవలందిస్తున్నారు. వేసవి రద్దీ ఎంత ఉన్నా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, తాగునీరు అందించడమే తమ ప్రాధాన్యతని టీటీడీ అధికారులు వెల్లడించారు.