...
...
Next Story

డిసెంబర్ 30 నుంచి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ - టీటీడీ ఈవో

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట‌ ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించారు.

Published on: Dec 5, 2025, 18:06:58 IST
Advertisement

తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో శుక్ర‌వారం ఉద‌యం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నాల‌కు టీటీడీ చేప‌ట్టిన ఏర్పాట్ల‌పై ఈవో భ‌క్తుల‌కు వివ‌రించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 30 నుండి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని ప్రకటించారు.

టీటీడీ ఈవో వెల్లడించిన ముఖ్యమైన అంశాలు:

  • డిసెంబర్ 30 నుండి జనవరి 08వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు.
  • ఈ పది రోజులకు గానూ 7.70 లక్షల మంది భక్తులకు దర్శన ఏర్పాట్లు ఉంటాయి.
  • పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164.15 గంటల సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయింపు.
  • డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ.
  • న‌వంబ‌ర్ 27 నుండి డిసెంబ‌ర్ 1వ తేది వ‌ర‌కు దాదాపు 25 లక్షల మంది భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.
  • డిసెంబర్ 02వ తేదీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయించారు.
  • మొదటి మూడు రోజులు S.E.D., శ్రీవాణి దర్శనాలు రద్దవుతాయి. మిగిలిన 7 రోజులకుగాను ఈరోజు (5వ తేదీ )ఉదయం 10 గం.లకు శ్రీవాణి దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గం.లకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం.
  • ఈ 10 రోజులలో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవు.
  • స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం ఉంటుంది.
  • జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం ఉంటుంది.

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe