...
...
Next Story

టీటీడీ : తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద ఈ లిస్టులోని పూజా కార్యక్రమాలు, ఫీజులు ఇలా

తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. కళ్యాణ వేదిక వద్ద పలు పూజా కార్యక్రమాలను భక్తులకు అందిస్తున్నారు. దీని సంబంధించిన రుసుములు ఇలా ఉన్నాయి.

Published on: Feb 8, 2026, 17:21:36 IST
Advertisement

తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద పూజా కార్యక్రమాలు
తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద పూజా కార్యక్రమాలు

శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అవకాశం కల్పిస్తుంది. కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఫీజులు ఇలా ఉన్నాయి:

  • వివాహం – ఉచితం
  • ఉపనయనం – రూ.300
  • సత్యనారాయణ వ్రతం – రూ.300
  • కేశఖండన – రూ.200
  • నామకరణం – రూ.200
  • అన్నప్రాసన – రూ.200
  • అక్షరాభ్యాసం – రూ.200
  • వాహన పూజ – రూ.200
  • చెవిపోగులు కుట్టడం – రూ.50
  • చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) – రూ.100
  • మేళం (ఒక సెట్టు) – రూ.100
  • మేళం (రెండు సెట్లు) – రూ.300
  • దస్త్ర పూజ – రూ.200
  • ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200

భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు. ఈ మేరకు టీటీడీ అధికారింగా ప్రకటన విడుదల చేసింది.

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆల‌యంలో ఫిబ్రవ‌రి 8 నుండి 16వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న బ్రహ్మోత్సవాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వహిస్తామ‌న్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవ‌రి 12న గరుడసేవ, ఫిబ్రవ‌రి 13న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవ‌రి 15న రథోత్సవం, ఫిబ్రవ‌రి 16న చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe