...
...
Next Story

నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు టీటీడీ వస్త్రాల ఆన్‌లైన్ ఈ-వేలం

నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు టీటీడీ వస్త్రాల ఆన్‌లైన్ ఈ-వేలం జరగనుంది. ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చు.

Published on: Nov 20, 2026, 15:59:28 IST
Advertisement

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను టీటీడీ నవంబర్ 23 నుండి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం నిర్వహించనుంది. మొత్తం 115 లాట్ల న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ-వేలం ఐడీ నంబర్లు 28814 నుండి 28819 వరకు ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఆసక్తి గల బిడ్డర్లు ఈ ఆన్‌లైన్ వేలంలో పాల్గొనవచ్చు. వేలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్ మేనేజర్ కార్యాలయం లేదా ఏఈవో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

అలాగే https://konugolu.ap.gov.in, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా 0877-2264429 ఫోన్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

నియామక నిబంధనలపై క్లారిటీ

టీటీడీ విజిలెన్స్ విభాగంలోని సెక్యూరిటీ / విజిలెన్స్ గార్డు పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి మాజీ సైనికులు, పౌరుల మధ్య అమలులో ఉన్న 1:2 నిష్పత్తిని రద్దు చేస్తూ టీటీడీ సాధికార మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిష్పత్తిని మార్చి కొత్త విధానంలో నియామకాలు చేపట్టే అంశం కేవలం ప్రతిపాదన దశలోనే ఉందని, దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలియజేసింది.

గతంలో అమలులో ఉన్న నియామక విధానమే ప్రస్తుతం కూడా యథాతథంగా కొనసాగుతోందని, నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. కావున, ఈ అంశంపై ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, అసత్య ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks