తిరుమలలో సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించిన పౌర్ణమి గరుడసేవలో భారత ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ వాహన సేవలో జీయర్ స్వాములు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ పాల్గొన్నారు. పౌర్ణమి గరుడ సేవలో పాల్గొన్న ఇతర ప్రముఖులలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, పలువురు బోర్డు సభ్యులు, ఇతర ఆలయ అధికారులు కూడా ఉన్నారు.
కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. నవంబరు 10వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.
{{/usCountry}}పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 10 నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. నవంబరు 10వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.
{{/usCountry}}నవంబరు 11వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, నవంబరు 12 నుండి 13వ తేదీ వరకు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, నవంబరు 14న ధర్మశాస్త్ర హోమం, నవంబరు 15న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.
అదేవిధంగా నవంబరు 16న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 17న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, నవంబరు 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 27 నుంచి డిసెంబరు 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), డిసెంబరు 8న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
గృహస్తులు (ఇద్దరు) రూ.500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా నవంబరు 15న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, డిసెంబరు 7న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి. గృహస్తులు (ఇద్దరు) రూ.500 చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్గొనవచ్చు.