ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ - తిరుమలలో సిఫార్సు లేఖలకు బ్రేక్! ఎప్పటివరకంటే..?
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం, వసతికి సంబంధించిన వీఐపీ సిఫార్సు లేఖల స్వీకరణను నిలిపివేసింది.
కలియుగ వైకుంఠమైన తిరుమలలో విఐపి దర్శనాలు, వసతి సౌకర్యాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడంతో తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంక్షలు
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నన్ని రోజులు శ్రీవారి దర్శనం, తిరుమలలో గదుల కేటాయింపు కోసం వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి వచ్చే ప్రతిపాదనలు, వీఐపి సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. సాధారణ భక్తులకు ప్రాధాన్యత పెంచడం, ఎన్నికల కోడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సిఫార్సు లేఖలను అనుమతించకపోయినప్పటికీ, స్వయంగా తిరుమలకు విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం మరియు వసతి సౌకర్యాలు కల్పిస్తారు. వీరితో పాటు వచ్చే ఇతర వ్యక్తులకు లేదా వీరి లేఖలపై వచ్చే అనుచరులకు ఈ వెసులుబాటు వర్తించదని అధికారులు స్పష్టత ఇచ్చారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతవరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి…. టీటీడీకి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభంగా ముగిశాయి. అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దేశవిదేశాల నుంచి విచ్చేసిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించామని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొందజి. గరుడసేవ రోజున ఉదయం నుంచి భారీ వర్షం కురిసినా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవను వీక్షించారని, వారికి అల్పాహారం, అన్నప్రసాదాలు, బాదం పాలు, సుండలు, జ్యూస్, బిస్కెట్లు అందించామని తెలిపింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

