తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు ఫిబ్రవరి 26న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు.

రెండో రోజు ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడో రోజు ఫిబ్రవరి 28న శ్రీ భూసమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా నాలుగో రోజు మార్చి 1న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 02వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేది వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రోగ్రాం బుక్ లెట్‌లను తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వర లక్ష్మీ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
08-02-2026 :
ఉదయం – ధ్వజారోహణం ( కుంభ లగ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)
{{/usCountry}}ఉదయం – ధ్వజారోహణం ( కుంభ లగ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)
{{/usCountry}}రాత్రి – పెద్దశేష వాహనం
09-02-2026 :
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
10-02-2026 :
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
11-02-2026 :
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
12-02-2026 :
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం
13-02-2026 :
ఉదయం – హనుమంత వాహనం
మధ్యాహ్నం- వసంతోత్సవం (మ. 2 నుండి 3 గంటల వరకు)
సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)
రాత్రి – గజ వాహనం
14-02-2026 :
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
15-02-2026 :
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
16-02-2026 :
ఉదయం – చక్రస్నానం(ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు)
రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)