TTD Board Meeting : ఈవో ఆకస్మిక బదిలీ తర్వాత టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశం వాయిదా

మంగళవారం (ఫిబ్రవరి 3) తిరుమలలో జరగాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్ట్ బోర్డు సమావేశం వాయిదా పడింది. ఈవో బదిలీతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

Published on: Feb 3, 2026, 12:07:23 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలలో జరగాల్సిన టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సమావేశం వాయిదా పడింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను అకస్మాత్తుగా బదిలీ చేశారు. అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీహెచ్. వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు టీటీడీ ఇంచార్జ్ ఈఓగా వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం.

టీటీడీ బోర్డు మీటింగ్ వాయిదా
టీటీడీ బోర్డు మీటింగ్ వాయిదా

కొత్తగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశాన్ని వాయిదా వేశారు. టీటీడీ బోర్డు మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది.

ఫిబ్రవరి 3వ తేదీన తిరుమలలో జరగాల్సిన టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సమావేశం వాయిదా పడింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను అకస్మాత్తుగా బదిలీ చేశారు. అదనపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీహెచ్. వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు టీటీడీ ఇంచార్జ్ ఈఓగా వెంకయ్య చౌదరికి బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం.

కొత్తగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశాన్ని వాయిదా వేశారు. టీటీడీ బోర్డు మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో తెలియాల్సి ఉంది.

కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేది వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రోగ్రాం బుక్ లెట్‌లను తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వర లక్ష్మీ పాల్గొన్నారు.

08-02-2026 :

ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)

రాత్రి – పెద్దశేష వాహనం

09-02-2026 :

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

10-02-2026 :

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

11-02-2026 :

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

12-02-2026 :

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

13-02-2026 :

ఉదయం – హనుమంత వాహనం

మధ్యాహ్నం- వసంతోత్సవం (మ. 2 నుండి 3 గంటల వరకు)

సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)

రాత్రి – గజ వాహనం

14-02-2026 :

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

15-02-2026 :

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

16-02-2026 :

ఉదయం – చక్రస్నానం(ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు)

రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)

టీటీడీకి రూ.10.51 లక్షలు విరాళం

హైదరాబాద్‌కు చెందిన సాయి సిద్ధార్థ్ ఎంటర్‌ప్రైజర్స్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.51 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More