రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించాయి. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట బీమా చెల్లించే చివరి తేదీని ఈ నెల ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక భక్షణ కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఇంతకుముందు నిర్ణయించిన తుది గడువు దగ్గర పడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ-సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు(CSC), గ్రామ/వార్డు సచివాలయాల వద్ద రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఒకేసారి వేలాది మంది పోర్టల్‌లోకి రావడంతో సాంకేతిక లోపాలు, సర్వర్ నిలిచిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.
దీంతో చాలామంది అర్హులైన రైతులు నమోదు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితిని గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సమస్య తీవ్రతను కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీమా కంపెనీలతో మాట్లాడి నమోదు గడువును పెంచేలా చర్యలు తీసుకుంది.
దీంతో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) - 2026 గడువు ఆగస్టు 15 వరకు పొడిగించారు. బ్యాంక్ రుణాలు పొందిన, పొందని రైతులందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రామ సచివాలయాలు, మీ-సేవ, సీఎస్సీ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పలు రకాల పంటలను ఈ బీమా పరిధిలోకి చేర్చారు. ప్రధాన పంటలు చూసుకుంటే.. వరి, పత్తి, మిరప, ఉల్లి, పసుపునకు వర్తిస్తుంది. అలాగే జొన్న, రాగి, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, ఆముదం రైతులు అప్లై చేసుకోవచ్చు.
గతంలో ఎదురైన సర్వర్ సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు, రైతులు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను ఆగస్టు 15లోపు పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (Weather Based Crop Insurance Scheme) నమోదు గడువు ఇప్పటికే ముగిసింది. రైతులు కేవలం PMFBY పైనే దృష్టి పెట్టాలి.
{{/usCountry}}గతంలో ఎదురైన సర్వర్ సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు, రైతులు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను ఆగస్టు 15లోపు పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (Weather Based Crop Insurance Scheme) నమోదు గడువు ఇప్పటికే ముగిసింది. రైతులు కేవలం PMFBY పైనే దృష్టి పెట్టాలి.
{{/usCountry}}రుణాలు ఉన్న రైతులతో పాటు ఎలాంటి రుణాలు తీసుకోని సాధారణ, కౌలు రైతులు కూడా తమ సమీప రైతు సేవా కేంద్రం లేదా సచివాలయానికి వెళ్లేసి, తక్కువ ప్రీమియంతో ఈ పంట బీమాను చేయించుకోవచ్చు.