...
...
Next Story

తిరుపతి ఎస్‌వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. మే 7వ తేదీన ఇంటర్వ్యూ!

SVRR Jobs 2026 : తిరుపతిలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర రామ్నారాయణ్ రుయా(SVRR) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగం పొందవచ్చు.

Published on: May 6, 2026, 11:53:02 IST
Advertisement

తిరుపతిలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర రామ్నారాయణ్ రుయా (SVRR) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఎస్‌వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ఎస్‌వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు

మీరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించాలనుకుంటే.. ఈ అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోకండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ రకాల నైపుణ్యాలు కలిగిన వారికి ఇందులో అవకాశం ఉంది. పోస్టుల పేరు, ఖాళీల సంఖ్య చూడండి.

  • డాక్టర్ (ఫుల్ టైమ్) 01
  • వార్డ్ బాయ్ 01
  • పీర్ ఎడ్యుకేటర్ 01
  • చౌకీదార్ (సెక్యూరిటీ) 01
  • హౌస్ కీపింగ్ వర్కర్ 01
  • యోగా థెరపిస్ట్/డ్యాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్ - 01

విద్యార్హత

పోస్టును బట్టి అర్హతలు మారుతుంటాయి. పదో తరగతి (10th) ఉత్తీర్ణత నుండి ఎంబీబీఎస్ (MBBS) చదివిన వారి వరకు అందరికీ అవకాశాలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

ఎటువంటి పరీక్షలు ఉండవు. అభ్యర్థుల అర్హత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇంటర్వ్యూలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సూచించిన విధంగా క్రింది పత్రాలతో పాటు 07.05.2026 తేదీన ఉదయం 11.00 గంటలలోపు తిరుపతిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

2. టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట (అసలు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు)

3. అందుబాటులో ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (latest)

4. క్యాస్ట్ సర్టిఫికేట్ (latest)

5. అనుభవ ధృవపత్రాలు

6. సంబంధిత పోస్టుకు సంబంధించిన ఏవైనా ఇతర ధృవపత్రాలు

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe