తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం - చర్లపల్లి(హైదరాబాద్) మధ్య నడిచే ((18527/18528) రైలును రెగ్యూలర్ ట్రైన్ గా మార్పు చేశారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది.
రెగ్యూలర్ ట్రైన్ గా మార్పు…

ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి చర్లపల్లి (హైదరాబాద్), ప్రతి శనివారం చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి వెళ్లే ఈ రైలు… ఇక రెగ్యులర్ గా మార్పు కానుంది. ఇందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- విశాఖపట్నం-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలు ( ట్రైన్ నెంబర్ 18527) ఇకపై ప్రతి శుక్రవారం విశాఖ నుంచి చర్లపల్లికి వస్తుంది.
- తిరుగు ప్రయాణంలో ఈ రైలు ( ట్రైన్ నెబంర్ 18528) చర్లపల్లి నుంచి విశాఖకు చేరుకుంటుంది.
- ఈ ట్రైన్ ఏప్రిల్ 3వ తేదీన (శుక్రవారం) రోజు విశాఖలో ప్రారంభమై… మరుసటి రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన (శనివారం) హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో అదే రోజు(ఏప్రిల్ 4) చర్లపల్లిలో ప్రారంభమై ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం చేరుకుంటుంది.
- ఈ ట్రైన్ విశాఖ, దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట, చర్లపల్లి స్టేషన్లలో ఆగుతుంది.
ట్రైమింగ్స్ ఇలా…
విశాఖపట్నం-చర్లపల్లి (18527) ట్రైన్…. ప్రతి శుక్రవారం విశాఖలో సాయంత్రం 05.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్…. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో (ట్రైన్ నెంబర్ 18528) ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రతి శనివారం చర్లపల్లిలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది.
ఈ రైళ్లలో 2ఏ, 3ఏ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ మరియు దివ్యాంగుల కోచ్‌లు ఉంటాయి.