విశాఖపట్నం నుంచి రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం దాకా బీచ్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన చాలా రోజులుగా ఉంది. 55-60 కిలో మీటర్ల విశాఖపట్నం-భోగాపురం కోస్టల్ కారిడార్(VBCC) పూర్తి చేస్తే విశాఖపట్నం ముఖచిత్రాన్ని మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్ భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి భవిష్యత్తు ప్రవేశ ద్వారం అని చెప్పవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ జూన్ 2026లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI), విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) ప్రాజెక్ట్ బ్లూప్రింట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాయి. ఈ రహదారి స్థానికుల జీవితానికి లేదా వ్యాపారాలకు అంతరాయం కలిగించకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రణాళికలో ఇప్పటికే ఉన్న రిసార్ట్‌లు, హోటళ్లను రక్షించడానికి రుషికొండ(రాడిసన్ బ్లూ జంక్షన్) సమీపంలో 1-కిలో మీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్, అగనంపూడి, కొమ్మాది వంటి రద్దీ ప్రాంతాల నుంచి తప్పించుకోవడానికి నాలుగు ఎలివేటెడ్ కారిడార్లు వంటి అనేక ప్లాన్స్ ఉన్నాయి. భీమిలి, భోగాపురం మధ్య తీరం వెంబడి 19.66 కి.మీ. కొత్త గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నిర్మిస్తారు. తద్వారా మార్గం సాధ్యమైనంత సరళంగా, అద్భుతంగా ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఫీడ్‌బ్యాక్ దశలో ఉంది. ఫిబ్రవరి 15 నాటికి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి 736 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో ఎక్కువగా భీమిలి-భోగాపురం మధ్య ఉన్న ప్రాంతానికి సంబంధించినవి. అభ్యంతరాలను సమర్పించడానికి మార్చి 10 చివరి తేదీగా నిర్ణయించారు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆప్ ఇండియా రోడ్డును నిర్మిస్తుంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వీఎంఆర్డీఏ స్పష్టమైన ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారిస్తుంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కోసం నివేదికను ఖరారు చేయడానికి విశాఖపట్నం, విజయనగరం జిల్లా కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం త్వరలో జరపనుంది ఎన్‌హెచ్ఏఐ.
విశాఖ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రస్తుతం ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లుగా విస్తరణ చేస్తారు. ఇక అక్కడ నుంచే భోగాపురం వరకు రహదారిని 60 మీటర్ల వెడల్పున చేస్తారు. అంతేకాదు ఈ మార్గంలో కొన్నిచోట్ల ఎలివేటెడ్ కారిడార్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్ ప్రయాణం అద్భుతం కానుంది.
ప్రశ్న : ఈ ప్రాజెక్టుతో లాభాలు ఏంటి?
{{/usCountry}}విశాఖ పోర్టు నుంచి కైలాసగిరి వరకు ప్రస్తుతం ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లుగా విస్తరణ చేస్తారు. ఇక అక్కడ నుంచే భోగాపురం వరకు రహదారిని 60 మీటర్ల వెడల్పున చేస్తారు. అంతేకాదు ఈ మార్గంలో కొన్నిచోట్ల ఎలివేటెడ్ కారిడార్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా విశాఖ-భోగాపురం కోస్టల్ కారిడార్ ప్రయాణం అద్భుతం కానుంది.
ప్రశ్న : ఈ ప్రాజెక్టుతో లాభాలు ఏంటి?
{{/usCountry}}జవాబు : ఈ ప్రాజెక్టుతో పూర్తైతే.. ప్రయాణ సమయం విశాఖ నుండి భోగాపురం విమానాశ్రయానికి 40 నుంచి 45 నిమిషాల పడుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. మధురవాడ ఐటీ హబ్, రాబోయే 'ఏరో సిటీ'కి ప్రత్యక్ష లింకులు ఉంటాయి. పర్యాటకపరంగానూ అభివద్ధి చెందుతుంది. వారసత్వ ప్రదేశాలు, లగ్జరీ రిసార్ట్‌లు, బీచ్ సైడ్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతుంది.
ప్రశ్న : ఈ కారిడార్ పొడవు, ఖర్చు అంచనా ఎంత?
జవాబు : మొత్తం పొడవు సుమారు 55 కిలో మీటర్ల నుంచి 60 కిలో మీటర్ల మధ్య ఉంటుంది. అంచనా వ్యయం రూ.6,300 కోట్లు ఉంటుంది. ఇందులో భూ సేకరణకు రూ.4,300 కోట్లు. విశాఖ పోర్టుకు చెందిన కంటెయినర్ టెర్మినల్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆరు వరుసల్లో కోస్టల్ కారిడార్ వేస్తారు. అయితే ఈ ప్రాజెక్టులో రాష్ట్రం వాటా, కేంద్రం వాటా గురించి తెలియాల్సి ఉంది.