పీఎం ఈ బస్ సేవా పథకంలో భాగంగా విశాఖకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-బస్ సేవ పథకం కింద మొదటి దశలో విశాఖపట్నానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ కార్యక్రమం కింద విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు నగరాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు అందనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం ఈ-బస్ సేవా పథకంలో భాగంగా తొలి విడతలో విశాఖపట్నం నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. విశాఖలోని సింహాపురి ఈ-బస్ డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ రూమ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రాంరంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం ఏపీకి మొత్తం 750 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిందని తెలిపారు. వీటిలో తొలి ప్రాధాన్యతగా విశాఖకు 100 బస్సులు కేటాయించామని, త్వరలోనే విజయావాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు నగరాలకు కూడా ఈ బస్సులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.
సింహాపురి డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ఆధునిక పవర్ రూమ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. బస్సుల ఛార్జింగ్ కోసం ప్రత్యేక విద్యుత్ సబ్‌స్టేషన్, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం చివరి దశకు చేరుకుందని చెప్పారు. మరో రెండు నుంచి మూడు నెలల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు విశాఖ రోడ్లపై పరుగులు తీస్తాయని, మిగిలిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కొత్త బస్సుల రాకతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) సేవలు మరింత బలోపేతం అవుతాయని, ప్రయాణికులకు పర్యావరణహితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, ప్రజారవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణపై వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబోమని, ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు, ఉద్యోగులు నమ్మవద్దని కోరారు.
'విశాఖకు కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ఆధునిక పవర్ రూం సిద్ధమైంది. పవర్ రూమ్‌తోపాటుగా సబ్ స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాల వేగంగా పూర్తికానున్నాయి. రెండు మూడు నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఈ బస్సుల వచ్చేనాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.' అని మంత్రి తెలిపారు.
డీజిల్ బస్సుల స్థానంలో ఈ-బస్సులు రావడం వల్ల నగరాల్లో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, అత్యవసర బటన్లు, జీపీఎస్ ప్రాసెస్, డిజిటల్ పేమెంట్ సౌకర్యాలు ఉంటాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్టీసీకి ఇంధన భారం తగ్గి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇవి తోడ్పడతాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


