...
...
Next Story

వైజాగ్‌లో వరల్డ్ ఫుడ్ ఇండియా రీజినల్ సదస్సు.. ఏ తేదీల్లో అంటే?

వరల్డ్ ఫుడ్ ఇండియా దక్షిణ ప్రాంతీయ సదస్సు విశాఖపట్నంలో త్వరలో జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated on: May 27, 2026, 14:02:54 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ వేదికగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పెద్ద పీట వేసేందుకు ఒక భారీ సదస్సు సిద్ధమవుతోంది. వచ్చే జూలై 9, 10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో 'వరల్డ్ ఫుడ్ ఇండియా' దక్షిణ ప్రాంతీయ సదస్సు జరగనుంది.

వైజాగ్‌లో వరల్డ్ ఫుడ్ ఇండియా రీజినల్ సదస్సు
వైజాగ్‌లో వరల్డ్ ఫుడ్ ఇండియా రీజినల్ సదస్సు

ఆహార రంగంలో సరికొత్త సాంకేతికత, ఎగుమతులు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే FICCI భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ సదస్సులో దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ప్రతినిధులు వస్తారు. పుదుచ్చేరి, లక్ష్ద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు కూడా పాల్గొంటాయి.

ఈ సదస్సు ప్రధానంగా మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల ఆదాయాన్ని పెంచేలా సరికొత్త అవకాశాలను సృష్టించడానికి, ఈ రంగంలో వచ్చే కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఎంతో దోహదపడుతుంది. ఆహార రంగంలో భారీగా పెట్టుబడులను తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అంతేకాదు సరికొత్త టెక్నాలజీని కూడా ప్రదర్శిస్తారు.

వ్యాపార భాగస్వామ్యాలను పెంపొందించుకోవడం, ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. వివిధ రాష్ట్రాల వ్యాపార సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తమ ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి.

ఈ సదస్సులో బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) సమావేశాలు, కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశాలు (Buyer-Seller Meets), ప్రముఖ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ చర్చలు జరగనున్నాయి. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అధికారుల సమాచారం ప్రకారం.. ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు దక్షిణ రాష్ట్రాల మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks