...
...
Next Story

తిరుమల జలాశయాల్లో పెరిగిన నీటిమట్టం - 5 డ్యామ్‌లలో నిల్వల పూర్తి వివరాలు ఇలా….

తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. శుక్రవారం నాటికి జలాశయాల్లోకి మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీరు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

Published on: Oct 23, 2026, 16:18:28 IST
Advertisement

శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుమలలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. కొండపైన ఉన్న ఐదు ప్రధాన డ్యామ్‌లలోకి శుక్రవారం నాటికి మొత్తం 61.68 లక్షల గ్యాలన్ల నీరు కొత్తగా వచ్చి చేరిందని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) జలమండలి అధికారులు వెల్లడించారు.

గోగర్భం డ్యామ్
గోగర్భం డ్యామ్

స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తుల తాగునీటి, ఇతర అవసరాలను తీర్చడానికి తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలే ప్రధాన ఆధారం. శుక్రవారం ఉదయం నాటికి లెక్కించిన నివేదికల ప్రకారం.. ఈ ఐదు డ్యామ్‌లలో కలిపి ఒకే రోజు 21.60 లక్షల గ్యాలన్ల నీటిని వివిధ అవసరాలకు వినియోగించగా, ఇంకా 40.08 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా నిల్వ ఉంది.

పాపవినాశనం డ్యామ్ :

తిరుమలలోనే అతిపెద్దదైన పాపవినాశనం డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 5,240.00 లక్షల గ్యాలన్లు.

  • నిన్నటి వరకు ఉన్న నిల్వ: 2,667.39 లక్షల గ్యాలన్లు
  • ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ: 2,688.35 లక్షల గ్యాలన్లు
  • పెరిగిన నీరు: 20.96 లక్షల గ్యాలన్లు
  • రోజువారీ వినియోగం: 14.10 లక్షల గ్యాలన్లు
  • వినియోగం పోగా మిగులు నీరు: 6.86 లక్షల గ్యాలన్లు

గోగర్భం డ్యామ్ :

  • గోగర్భం జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 2,833.10 లక్షల గ్యాలన్లు.
  • నిన్నటి వరకు ఉన్న నిల్వ: 499.06 లక్షల గ్యాలన్లు
  • ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ: 508.31 లక్షల గ్యాలన్లు
  • పెరిగిన నీరు: 9.25 లక్షల గ్యాలన్లు
  • రోజువారీ వినియోగం: 7.50 లక్షల గ్యాలన్లు
  • వినియోగం పోగా మిగులు నీరు: 1.75 లక్షల గ్యాలన్లు

ఆకాశగంగ డ్యామ్ :

  • పవిత్రమైన ఆకాశగంగ జలాశయం నిల్వ సామర్థ్యం 685.00 లక్షల గ్యాలన్లు.
  • నిన్నటి వరకు ఉన్న నిల్వ: 24.07 లక్షల గ్యాలన్లు
  • ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ: 30.40 లక్షల గ్యాలన్లు
  • పెరిగిన నీరు: 6.33 లక్షల గ్యాలన్లు
  • రోజువారీ వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు
  • మిగులు నీరు: 6.33 లక్షల గ్యాలన్లు

కుమారధార డ్యామ్ :

  • కుమారధార జలాశయం నిల్వ సామర్థ్యం 4,259.01 లక్షల గ్యాలన్లు.
  • నిన్నటి వరకు ఉన్న నిల్వ: 338.84 లక్షల గ్యాలన్లు
  • ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ: 363.98 లక్షల గ్యాలన్లు
  • పెరిగిన నీరు: 25.14 లక్షల గ్యాలన్లు
  • రోజువారీ వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు
  • మిగులు నీరు: 25.14 లక్షల గ్యాలన్లు

పసుపుధార డ్యామ్ :

  • పసుపుధార జలాశయం నిల్వ సామర్థ్యం 1,287.54 లక్షల గ్యాలన్లు.
  • నిన్నటి వరకు ఉన్న నిల్వ: 24.38 లక్షల గ్యాలన్లు
  • ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ: 24.38 లక్షల గ్యాలన్లు
  • పెరిగిన నీరు: 0.00 లక్షల గ్యాలన్లు
  • రోజువారీ వినియోగం: 0.00 లక్షల గ్యాలన్లు
  • మిగులు నీరు: 0.00 లక్షల గ్యాలన్లు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో 7.02 లక్షల గ్యాలన్లు, నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో 148.48 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా జలాశయాల్లోకి వచ్చి చేరింది. అక్టోబర్ 23వ తేదీ నాటికి తిరుమల జలాశయాల్లో మొత్తం 244.46 లక్షల గ్యాలన్ల నీరు అదనంగా చేరింది.

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలతో పాటు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో డ్యామ్ ల్లోకి అదనంగా వచ్చి నేరు చేరటంతో నీటి మట్టం పెరిగింది. ఎల్ నినో వంటి సమయంలో నీటిమట్టం పెరగటంపై అధికారులతో పాటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks