కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ తర్వాత మీడియాతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. టీడీపీ మూడు జాతీయ సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను పార్లమెంటులో చర్చించాలని కోరామన్నారు. అమరావతికి చట్టపరమైన హోదా ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి చట్టపరమైన మద్దతు ఇవ్వడానికి ఒక బిల్లు అవసరం కావచ్చు అని అన్నారు.

భారత ఎఫ్టీఏలు(స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు), 16 ఏళ్లలోపు విద్యార్థుల కోసం సోషల్ మీడియా నిబంధనలు, అమరావతి రాజధాని బిల్లు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. 'మూడు జాతీయ సమస్యలు, ఏపీకి సంబంధించి పలు అంశాలపై చర్చించాలని కోరాం. భారత్-యూరోపియన్ యూనియన్ ఎఫ్టీఏతో సహా భారత్ సంతకం చేసిన ఎఫ్టీఏలకు సంబంధించిన మొదటి జాతీయ సమస్య. మరో సమస్య 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం. ఆస్ట్రేలియా చేయగలిగితే భారత్ ఎందుకు చేయలేదు? మేం చర్చించాలని చెప్పిన ప్రధాన రాష్ట్ర సమస్య అమరావతి రాజధాని బిల్లు సమస్య.' అని లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు.
ప్రధాని, ముఖ్యమంత్రి సహా కీలక నేతలు 30 రోజులపాటు జైలులో ఉంటే పదవిని కోల్పోయే.. బిల్లుపై చర్చించాలని కోరామన్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు. పూర్వోదయ పథకం కింద వీలైనన్ని ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరామన్నారు. నదుల అనుసంధానికి సహకరించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాలకు ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, ప్రమోద్ తివారీ, ఏఐటీసీ నేత శతాబ్ది రాయ్, ఎంఎన్ఎం వ్యవస్థాపకుడు కమల్ హాసన్, తమిళ మనీలా కాంగ్రెస్ నేత జీకే వాసన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ప్రధాన కమిటీ గదిలో జరిగిన ఈ సమావేశంలో రాబోయే బడ్జెట్ సమావేశాల ఎజెండాను వివరించారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. మొదటి దశ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో 30 సిట్టింగ్‌లు ఉంటాయి. 2026-27 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. బుధవారం లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
{{/usCountry}}పార్లమెంట్ ప్రధాన కమిటీ గదిలో జరిగిన ఈ సమావేశంలో రాబోయే బడ్జెట్ సమావేశాల ఎజెండాను వివరించారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. మొదటి దశ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో దశ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో 30 సిట్టింగ్‌లు ఉంటాయి. 2026-27 కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. బుధవారం లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
{{/usCountry}}