ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. నవంబర్ 3న ఫలితాలు
పులివెందుల అంశంపై ఎస్పీతో మాట్లాడినట్టుగా ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా చెప్పారు. పులివెందుల అంశం మీద నివేదిక వస్తే చర్యలు తీసుకుంటాను అని స్పష్టం చేశారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశంలో మాట్లాడారు. పులివెందుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పులివెందుల అంశం మీద ఎస్పీతో మాట్లాడినట్టుగా వెల్లడించారు. నివేదిక వస్తే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే.. అధికారులు నివేదిక పంపుతారని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

'కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చాయి. మరికొన్ని జిల్లాల నుంచి అసలు ఫిర్యాదులు రాలేదు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏ జిల్లాలోనూ పోలింగ్ సమస్యలు లేవు. అనంతపురం, పల్నాడు జిల్లాల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఆధారాలు చూసి నిర్ణయం తీసుకుంటాం.' అని ఎస్ఈసీ పునేఠా అన్నారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించామన్నారు ఎస్ఈసీ. అన్ని జిల్లాల్లో పోలింగ్ తీరుపై సమీక్ష నిర్వహించామన్నారు. జిల్లాల పరిశీలకులతో ఎప్పటికప్పుడు మాట్లాడమన్నారు. శాంతిభద్రతల అంశం ప్రధానమని అధికారులకు చెప్పామన్నారు.
ఏపీలో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. 11 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ ముగిసినట్లుగా తెలిపారు. నవంబర్ 3వ తేదీన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలలోపు బూత్‌లో ఓటు వేయడానికి క్యూలో ఉన్నవారికే అవకాశం కల్పిస్తామన్నారు. అయితే విజయవాడ 55వ డివిజన్‌లో ఓటంగ్ సమయాన్ని పొడిగించినట్టుగా వెల్లడించారు. రాత్రి 7.30 దాకా పోలింగ్ అన్నారు.
'విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్ మీద గుర్తులు తారుమారు కావడం కారణంగా ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకే అదనపు సమయాన్ని కేటాయించాం. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ముగిసినందున బ్యాలెట్ బాక్సుల తరలిస్తున్నాం. శాంతి భద్రతల అంశాన్ని ప్రధానంగా భావించి ఎన్నికలు నిర్వహించాం. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించాం. ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు నవంబర్ 3వ తేదీన వెలువడుతాయి.' అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా పేర్కొన్నారు.
నవంబర్ 2 వరకు పోలింగ్ శాతంపై స్పష్టత వస్తుందని ఎస్ఈసీ చెప్పారు. 2021లో 63.6 పోలింగ్ శాతం నమోదైందన్నారు. ఫిర్యాదులు వచ్చిన జిల్లాల కలెక్టర్, ఎస్పీల నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల సంఘం పనిచేస్తుందని గుర్తుచేశారు. నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తు్న్నామని వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


