ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు.. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచన!

Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది.

Published on: Apr 11, 2026, 12:12:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ(ఏపీఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. తీవ్రమైన వేడి, వడగాలులు, అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తీవ్రమైన వేడి, వేడి గాలులు, తేమతో కూడిన పరిస్థితుల పట్ల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కోరారు.

ఆంధ్రప్రదేశ్ వాతావరణం
ఆంధ్రప్రదేశ్ వాతావరణం

శుక్రవారం ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత కాకినాడ జిల్లాలోని కరప్పలో 44.1డిగ్రీలు, కడపలో 43.6డిగ్రీలుగా నమోదవ్వగా, 22 జిల్లాల్లో ఉష్ణోగ్రత 40కి పైగా నమోదైంది. శనివారం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ వంటి 10 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.

ఎండలోకి వెళ్లేటప్పుడు టోపీలు ధరించాలని, లేత రంగు కాటన్ దుస్తులు వేసుకోవాలని, కళ్లను కాపాడుకోవడానికి కళ్లద్దాలు పెట్టుకోవాలని విపత్తు నిర్వహణ అథారిటీ ప్రజలకు సూచించింది. గుండె జబ్బులు, మధుమేహం, లేదా రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని తెలిపారు.

ఇదిలా ఉండగా తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాలపై ద్రోణి ఏర్పడటంతో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు చెదురుమదురుగా కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సమయంలో రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.

ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో శనివారం వేడి గాలులు.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలో 20, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 6, అనకాపల్లి జిల్లాలో 5, పార్వతీపురం మన్యం జిల్లాలో 14, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం జిల్లాలో 6, అనకాపల్లి జిల్లాలో 5, కాకినాడ జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 4, ఏలూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో వేడిగాలులు వీయనున్నాయి. 79 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. ఆదివారం రోజున ఏకంగా 93 మండలాల్లో వడ గాలులు వీచే అవకాశం ఉంది.

ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి. ఈ అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More