AP Inter Hall Ticekt 2026 : ఏపీ ఇంటర్ పరీక్షలు - హాల్ టికెట్ అప్డేట్స్ తెలుసుకోండి
ఏపీ ఇంటర్ పరీక్షల సమయం దగ్గరపడింది.ఏ క్షణమైనా హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. https://bie.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి లేదా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలకు సమయం దగ్గరపడింది. ఈనెల 10వ తేదీతో ప్రాక్టికల్ పరీక్షలు కూడా పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో హాల్ టికెట్ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే ఏ క్షణంలోనైనా వీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

ఏపీ ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షురూ అవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య నిర్వహిస్తారు.
హాల్ టికెట్లు ఎప్పుడు..?
రాష్ట్రంలో ఈసారి జరగబోయే ఇంటర్ పరీక్షల కోసం దాదాపు పది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. గతేడాది మార్చి 1వ తేదీన పరీక్షలు ప్రారంభం కాగా… ఫిబ్రవరి 21న విడుదల చేశారు. ఈసారి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో…. ఫిబ్రవరి 11 లేదా ఫిబ్రవరి 12 తేదీల్లో హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ప్రధాన పరీక్షల ముందు పది నుంచి 12 రోజుల వ్యవధిలో హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ లెక్కన ఈ రెండు రోజుల్లోనే హాల్ టికెట్లు విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
ఏపీ ఇంటర్ హాల్‌టికెట్లు -ఎలా డ్లౌనోడ్ చేసుకోవాలి…?
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు . https://bie.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి లేదా మనమిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సులభంగా వీటిని పొందే అవకాశం ఉంది.
- ముందుగా https://bie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఐపీఈ హాల్ టికెట్ లింక్ క్లిక్ చేయాలి.
- సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే టెన్త్ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- డౌన్లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.
వాట్సాప్ నుంచి ఇలా…
ఇక ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా 9552300009 వాట్సప్ నంబర్‌కు Hi అని మెసేజ్ సెండ్ చేయాలి. ‘ఎడ్యుకేషన్ సర్వీసెస్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
ఏపీ ఇంటర్ 2026 - ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 23 - ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.
- ఫిబ్రవరి 25 - ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1.
- ఫిబ్రవరి 27 - ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1, బోటనీ పేపర్ 1.
- మార్చి 2 - ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ.
- మార్చి 5 - ఫస్ట్ ఇయర్ జూవాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1.
- మార్చి 7 - ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 1.
- మార్చి 10- ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1.
- మార్చి 12 - ఫస్ట్ ఇయర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1.
- మార్చి 14- ఫస్ట్ ఇయర్ సివిక్స్ 1.
- మార్చి 17 - ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1.
- మార్చి 21 - ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1.
- మార్చి 24 - ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1.
ఏపీ ఇంటర్ 2026 - సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ :
- ఫిబ్రవరి 24 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2.
- ఫిబ్రవరి 26 - ఇంగ్లీషు పేపర్ 2.
- ఫిబ్రవరి 28 - సెకండ్ ఇయర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2.
- మార్చి 4 - సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2.
- మార్చి 6 - సెకండ్ ఇయర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2.
- మార్చి 9- సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2బి.
- మార్చి 11- సెకండ్ ఇయర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2.
- మార్చి 13- సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2.
- మార్చి 16 - సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2.
- మార్చి 18 - సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2.
- మార్చి 23 - సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

