...
...
Next Story

AP Inter Results 2026 : ఈనెల 22 నుంచి స్పాట్ వాల్యుయేషన్ - ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

AP Inter Exam Results 2026 : ఏపీ ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 25వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తవుతాయి. అయితే మరోవైపు స్పాట్ కు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈనెల 22 నుంచి ఈ ప్రక్రియ షురూ అవుతుంది. అయితే ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

Published on: Mar 21, 2026 04:34 PM IST
Advertisement

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 24వ తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ రంజాన్ సెలవు 21వ తేదీకి మారటంతో… ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షలను మార్చి 25వ తేదీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

స్పాట్ వాల్యూయేషన్ ఎప్పుడంటే..?

ఏపీ ఇంటర్
ఏపీ ఇంటర్

ఏపీ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ మార్చి 22వ తేదీ నుంచి షురూ కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ముందుగా లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, మరియు ఎకనామిక్స్ పేపర్ల మూల్యాంకనం జరగనుంది. వీటితో పాటు స్పెల్-1 కింద వచ్చే ఒకేషనల్ సబ్జెక్టుల పేపర్లను కూడా అదే రోజున పూర్తి చేస్తారు. మిగతా సబ్జెక్టులను స్పెల్స్ వారీగా పూర్తి చేస్తారు.

ఇక స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఏపీ ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఈ ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..?

ఏపీ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా 10వ తేదీలోపే రిలీజ్ చేేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పాట్ పూర్తి కాగానే… సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అంతా ఒకే అయిన తర్వాత… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…. అధికారికంగా ఓ తేదీని ప్రకటిస్తారు.

విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.

మనమిత్ర వాట్సాప్‌లో ఇలా..

  1. మనమిత్ర వాట్సప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ సెండ్ చేయాలి.
  2. రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి
  3. తర్వాత ‘Education Services’ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి
  4. ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోండి అని కనబడుతుంది.
  5. ఫలితాల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ యాక్టివ్‌ అయిన తర్వాత మీ హాల్‌టికెట్‌ నెంబర్ నమోదు చేయాలి.
  6. మీ వాట్సప్‌ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్‌ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe