తిరుపతి జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. సాంబలక్ష్మీ అనే మహిళను సోమశేఖర్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొర్లకుంట మారుతీనగర్‌లో జరిగింది. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సోమశేఖర్ అనే వ్యక్తి గుత్తివారిపల్లికి చెందినవాడు. ఐదు ఏళ్లుగా కొర్లకుంట మారుతీనగర్‌లో గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి పెళ్లి అయింది. కానీ భార్యతో గొడవల కారణంగా వేరుగా ఉంటున్నాడు. ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన సాంబలక్ష్మీ కొంతకాలం జీవకోనలో నివసించేది. తర్వాత కొర్లకుంట మారుతీనగర్‌లో తన భర్త, కుమారుడితో కలి ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సమోసాల దుకాణంలో పనిచేసేది.
గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే సోమశేఖర్.. సమోసాల దుకాణం వచ్చేవాడు. ఈ క్రమంలో సాంబలక్ష్మీతో పరిచయం ఏర్పడింది. తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధం కొంతకాలంగా కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉండేవి. సోమశేఖర్‌తో ఈ తలనొప్పి తనకు ఎందుకని కొంతకాలంగా సాంబలక్ష్మీ దూరంగా ఉంటుంది. వివాహేతర సంబంధానికి నిరాకరించింది. ఈ కారణంగా సోమశేఖర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
చివరిసారిగా ఒకే ఒకసారి నీతో మాట్లాడాలని అని సాంబలక్ష్మీని సోమశేఖర్ నమ్మించాడు. తన రూమ్‌కు పిలిపించుకున్నాడు. ఇదే సమయంలో మళ్లీ గొడవ జరిగి.. సాంబలక్ష్మీపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
సాంబలక్ష్మీ, సోమశేఖర్ మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అందులో భాగంగానే సోమశేఖర్ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత స్పష్టత రావాలంటే విచారణ కొనసాగాల్సి ఉంది. రుయా ఆసుపత్రికి పోలీసులు మృతదేహాలను తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన ప్రధాన కారణాలపై దృష్టి పెట్టారు.
{{/usCountry}}సాంబలక్ష్మీ, సోమశేఖర్ మధ్య ఎప్పుడూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. అందులో భాగంగానే సోమశేఖర్ హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత స్పష్టత రావాలంటే విచారణ కొనసాగాల్సి ఉంది. రుయా ఆసుపత్రికి పోలీసులు మృతదేహాలను తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన ప్రధాన కారణాలపై దృష్టి పెట్టారు.
{{/usCountry}}