సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని.. ఆ తర్వాత చంద్రబాబుకు రోజూ సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. అద్దంకి నియోజకవర్గం నేతలతో బుధవారం సమావేశమైన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడారు.
సినిమా చూపిస్తాం - జగన్ వార్నింగ్

ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కూటమి పాలనలో ఇప్పటికే రెండేళ్లు పూర్తి అయ్యాయని చెప్పారు. చంద్రబాబుకు మిగిలింది మరో మూడేళ్లు మాత్రమేనని… ఏడాదిన్నర తర్వాత తాను పాదయాత్ర చేపడతానని పేర్కొన్నారు. పార్టీ మొత్తం రంగంలోకి దిగుతుందని… చంద్రబాబుకు భయపడే రోజులు పోయాయన్నారు.
“ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. కాగా, చంద్రబాబు చేసే రెడ్‌బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చిందని, ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు పునాదులు పడింది 2022లోనే జగన్ గుర్తు చేశారు. కానీ క్రెడిట్ కోసం ఇప్పుడు చంద్రబాబు వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మారడని.. క్రెడిట్ యావ చావదంటూ విమర్శించారు. ఆర్సెనాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ గురించి అంతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు… అదే నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ఆ ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు.
కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తాం - జగన్
జగన్ 2.0 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పెంపు ఒక గుడ్‌న్యూస్ అని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం అన్న ఆయన…, దాని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఇంకా దాని వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}జగన్ 2.0 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పెంపు ఒక గుడ్‌న్యూస్ అని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం అన్న ఆయన…, దాని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఇంకా దాని వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డారు.
{{/usCountry}}వైసీపీ హయాంలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు, డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశామని జగన్ చెప్పారు. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయన్నారు.
మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారని ఎత్తి చూపారు. అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారని… బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్‌స్టార్ లెవెల్‌లో కట్టొచ్చని తెలిపారు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
“చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యాదీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు” అని జగన్ విమర్శించారు.