అంతా హైజాక్, రిగ్గింగ్.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జగన్ రియాక్షన్

YS Jagan : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ స్పందించారు. చంద్రబాబుతోపాటుగా పోలీసులకు, ఎన్నికల సంఘానికి కౌంటర్ ఇచ్చారు.

Published on: Nov 3, 2026, 20:34:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా చూపించింది. వైసీపీని చిత్తుగా ఓడించింది. జగన్ నియోజకవర్గం పులివెందుల సైతం కూటమికే దక్కింది. నందికొట్కూరు, బేతెంచర్లలో వైసీపీ పట్టిసాధించింది. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలతాలు వైసీపీ అధినేత జగన్ స్పందించారు. చంద్రబాబుతోపాటుగా పోలీసులకు, ఎన్నికల సంఘానికి కౌంటర్ ఇచ్చారు.

వైఎస్ జగన్
వైఎస్ జగన్

'అభినందనలు.. చంద్రబాబు బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు! ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు! ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్‌ చేశారు. నామినేషన్లు: హైజాక్‌! నామినేషన్ల పరిశీలన: హైజాక్‌! నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్‌! పోలింగ్‌ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు! పోలింగ్‌: రిగ్గింగ్‌! పోలింగ్‌ శాతం: తారుమారు! ఓట్ల లెక్కింపు: హైజాక్‌! అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు! అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే! ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!' అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కంచుకోటలో జగన్‌కు షాక్

ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందులలో గట్టి దెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంచుకోటగా భావించే పులివెందుల మున్సిపాలిటీ స్థానాన్ని అధికార తెలుగు దేశం పార్టీ తొలిసారిగా కైవసం చేసుకుంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థి గీతా కుమారి, వైఎస్సార్‌సీపీకి చెందిన వైఎస్ ప్రమీలపై 13 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. పులివెందులలోని 40 వార్డుల్లో టీడీపీ 34, బీజేపీ 2, జనసేన 1, వైఎస్సార్‌సీపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి.

వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి రాజకీయ కంచుకోటగా ఉంది. మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి ఇది కంచుకోటగా నిలిచింది. దీర్ఘకాలంగా వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ ప్రాంతంలో టీడీపీకి ఇది పెద్ద విజయం. పులివెందులలో ఇటీవల ఓటు వేసేందుకు వచ్చిన జగన్.. నిరసన తెలిపారు. ఆర్వో ఆఫీసు ఎదుట బైఠాయించారు. ఇక్కడ రీపోలింగ్ పెడితేనే ఓటు వేస్తానని చెప్పి వెళ్లిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కూడిన 92 పట్టణ స్థానిక సంస్థలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More