ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. వైఎస్ షర్మిల, అనిల్ కుమార్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైంది. ఈ వార్తను వైఎస్ షర్మిల స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించారు. సోమల సుబ్బా రెడ్డి కుమారుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనున్నట్లు ఆమె తెలిపారు.

'నా భర్త అనిల్ కుమార్, నేను దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా కుమార్తె వివాహానికి సంబంధించిన ఈ శుభవార్తను మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా కుమార్తె అంజలి రెడ్డి, డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డిల వివాహబంధానికి మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలు, శుభాకాంక్షలు కావాలని కోరుకుంటున్నాం.' అని వైఎస్ షర్మిల రాసుకొచ్చారు.
వరుడు రఘురామ్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వివరాలను కూడా షర్మిల పంచుకున్నారు. వీరి కుటుంబం మూలాలు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందినవి కాగా, ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులుగా అక్కడే స్థిరపడ్డారు. వృత్తిరీత్యా డాక్టర్ రఘురామ్ రెడ్డి అమెరికాలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్సార్ కడప జిల్లాకు చెందింది కాగా, వరుడి కుటుంబం రాయలసీమకే చెందిన కర్నూలు జిల్లాకు సంబంధించింది కావడం విశేషం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మనవరాలు, షర్మిల కుమార్తె అయిన అంజలి రెడ్డి విద్యాభ్యాసం విదేశాల్లోనే సాగింది. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో ఇటీవల వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుక ముగిసిన కొద్ది నెలల్లోనే ఇప్పుడు కుమార్తె అంజలి రెడ్డి వివాహం జరగనుంది.
ఈ జంట నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలను, వేదిక వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. రాజారెడ్డి పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైనట్లే, అంజలి రెడ్డి వివాహ వేడుకను కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
{{/usCountry}}ఈ జంట నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలను, వేదిక వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. రాజారెడ్డి పెళ్లికి కుటుంబ సభ్యులతో పాటు ఇరు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైనట్లే, అంజలి రెడ్డి వివాహ వేడుకను కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
{{/usCountry}}