ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో తక్షణమే ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో విస్తృతంగా రాజకీయ హింస జరుగుతోందని, ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడిపై జగన్ నిప్పులు చెరిగారు. "ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. వరుసగా రెండో రోజు కూడా చంద్రబాబు శాంతిభద్రతల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ శ్రేణులకు గూండాగిరీ చేసేందుకు లైసెన్స్ ఇచ్చి, పోలీసు యంత్రాంగాన్ని వారికి కొమ్ముకాసేలా ఉపయోగిస్తున్నారు. పొలిటికల్ టెర్రరిజానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుపుతున్నారు," అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసు యంత్రాంగం కళ్లముందే దౌర్జన్యాలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. "నామినేషన్ కేంద్రాల ప్రాంగణంలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులను కత్తులు, కర్రలతో తరిమితరిమి కొడుతున్నారు. రిటర్నింగ్ అధికారుల ఆఫీసుల్లోకి జొరబడి నామినేషన్ పత్రాలను చింపేస్తున్నారు. అర్థరాత్రి వేళ పోలీసులే స్వయంగా అభ్యర్థులను అపహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా కైవసం చేసుకునేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు," అని విమర్శించారు.
ఎంపీలను కూడా వదల్లేదు - వైఎస్ జగన్
ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపాదికులుగా వెళ్లిన తమ పార్టీ ఎంపీలను కూడా వదల్లేదని, వారి చేతుల్లోని పత్రాలను లాక్కుని చింపివేశారని జగన్ తెలిపారు. "పోలీసుల సమక్షంలోనే ముగ్గురు ఎంపీలపై దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?" అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా అనేక ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయని జగన్ పేర్కొన్నారు.
{{/usCountry}}కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా అనేక ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయని జగన్ పేర్కొన్నారు.
{{/usCountry}}"చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం. పులివెందులలో పోలీసులు జరిపిన కాల్పులు ప్రజాస్వామ్యంపై బాంబు దాడి లాంటివి. నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను, ప్రతిపాదికులను పోలీసులు ఎందుకు కొట్టారు? తుపాకులు ఎందుకు పేల్చాల్సి వచ్చింది…..?" అని జగన్ నిలదీశారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. సూపర్-6, సూపర్-7 హామీల పేరుతో ప్రజలను మోసం చేసి…. ఇప్పుడు ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.