ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌- మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి కొడుకు హీరో

ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ నేరుగా రిలీజైంది. ఇందులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించాడు. 2021లో మొదలైన ఈ సినిమా ఇన్నాళ్లకు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 

Published on: Dec 23, 2025, 11:31:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2021లో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న తెలుగు సినిమా ఒకటి ఇన్నాళ్లకు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ సినిమా పేరు కూడా డిఫరెంట్ గా ఉంది. అదే 11:11 మూవీ. ఈ 11:11 సినిమా ఇవాళ (డిసెంబర్ 23) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు రాజీవ్ హీరో. ఇదో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

ఓటీటీలోకి తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ (x)

11:11 ఓటీటీ

ఓటీటీలోకి మంగళవారం ఓ తెలుగు సినిమా వచ్చేసింది. 11:11 మూవీ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో రిలీజైంది. ఇది థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది.

నాలుగేళ్లకు

మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొడుకు రాజీవ్ హీరోగా 2021లో 11:11 షూటింగ్ ప్రారంభమైంది. అప్పటికే రాజీవ్ కొన్ని సినిమాలు చేశాడు. ఈ 11:11 మూవీ ఫస్ట్ లుక్ ను అప్పట్లో చిరంజీవి లాంఛ్ చేశారు. ఇందులో వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరోయిన్. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ బ్యానర్లపై దీన్ని నిర్మించారు. ఈ 11:11 సినిమాకు కిట్టు నల్లూరి డైరెక్టర్.

సైలెంట్ గా

థియేటర్లో రిలీజ్ కోసం తెరకెక్కించిన 11:11 మూవీ వివిధ కారణాల వల్ల విడుదల కాలేదు. థియేటర్లో రిలీజ్ చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇందులో రాజీవ్, వర్ష విశ్వనాథ్ తో పాటు సదన్, రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజ శ్రీ తదితరులు నటించారు.

11:11 స్టోరీ

డిఫరెంట్ స్టోరీతో ఈ 11:11 సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో రాజీవ్, హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ ఇద్దరు ప్రేమించుకుంటారు. హ్యాపీగా తమ లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సమయంలో మధ్యలోకి మూడో వ్యక్తి వస్తాడు.

లవర్స్ మధ్యలోకి వచ్చిన మూడో వ్యక్తి హత్య జరుగుతుంది. దీంతో సినిమా ఒక్కసారిగా థ్రిల్లింగ్ మూమెంట్ ను అందిస్తుంది. మరి ఆ హత్య ఎవరు చేశారు? వచ్చిన మూడో మనిషి ఎవరు? అనేది ఈ 11:11 మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More