...
...
Next Story

Prabhas: 2027లో రెబల్ రచ్చ.. ప్రభాస్ నామ సంవత్సరం.. ఫౌజీ, స్పిరిట్ రిలీజ్ ప్లాన్ ఇదే!

Prabhas: 2026 ఇయర్ ను ప్రభాస్ ఫ్యాన్స్ మర్చిపోవాల్సిందే. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ గా నిలిచింది. కానీ 2027లో మాత్రం రెబల్ రచ్చ మామూలూగా ఉండదు. భారీ సినిమాలైన ఫౌజీ, స్పిరిట్ వచ్చే ఏడాది థియేటర్లకు రాబోతున్నాయి. దీంతో వచ్చే ఏడాదిని ప్రభాస్ నామ సంవత్సరమని అంటున్నారు.

Published on: Oct 19, 2026, 05:57:42 IST
Advertisement

Prabhas: 2026లో ప్రభాస్ హీరోగా నటించిన రెండో సినిమా కూడా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఫౌజీ మూవీని డిసెంబర్ 4న రిలీజ్ చేస్తామని ముందు మేకర్స్ ప్రకటించారు. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ ఈ మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు. ఇక తాజాగా స్పిరిట్ రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ అయింది.

2027లో రచ్చ

2027లో రెబల్ రచ్చ.. ప్రభాస్ నామ సంవత్సరం.. ఫౌజీ, స్పిరిట్ రిలీజ్ ప్లాన్ ఇదే! (x/imvangasandeep)
2027లో రెబల్ రచ్చ.. ప్రభాస్ నామ సంవత్సరం.. ఫౌజీ, స్పిరిట్ రిలీజ్ ప్లాన్ ఇదే! (x/imvangasandeep)

ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే 2027లో రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ రచ్చ పీక్స్ కు చేరేలా కనిపిస్తోంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న ఫౌజీ మూవీ మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ ఏమో అక్టోబర్ 29న థియేటర్లకు రాబోతుంది.

రిలీజ్ డేట్ ప్లాన్

2027లో ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ల వెనుక మేకర్స్ పెద్ద ప్లాన్ వేసినట్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఫౌజీ మూవీని మార్చి 18న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమాకు ఏకంగా 11 రోజుల్లో రెండు లాంగ్ వీకెండ్లు, రెండు నేషనల్ హాలీడేస్ కలిసి వస్తాయి.

మార్చి 18 అంటే గురువారం ఫౌజీ రిలీజ్ అనుకుంటే.. శుక్రవారం, శనివారం, ఆదివారం బాక్సాఫీస్ దగ్గర మూవీ జోరు కొనసాగుతోంది. సోమవారం (మార్చి 22) హోలీ సందర్భంగా హాలీడే. ఇక తర్వాతి ఫ్రైడే (గుడ్ ఫ్రైడే) కూడా సెలవే.

దీపావళి రేసులో

ఫౌజీ, స్పిరిట్ రెండు డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న సినిమాలు. ఫౌజీలో ప్రభాస్ ఎమో సోల్జర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ అప్డేట్స్ హైప్ పెంచేశాయి. ఇక స్పిరిట్ లో ఏమో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ అదరగొట్టబోతున్నాడు. ఫౌజీ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ కాగా.. స్పిరిట్ లో రెబల్ స్టార్ తో త్రిప్తి డిమ్రి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

అయితే స్పిరిట్ మూవీ హిందీ చిత్రం రామాయణ పార్ట్ 2తో పోటీపడనుంది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రాయాయణ పార్ట్ 2 వచ్చే ఏడాది దీపావళికే థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks