321 Movie Review And Rating In Telugu:

టైటిల్: 321 (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్)
నటీనటులు: మోహిత్ పెడద, లావణ్య సహుకర, వివాన్ సూర్య, లక్ష్మి వెన్నెల తదితరులు
దర్శకత్వం: శాంతికుమార్ చిలుముల
సంగీతం: కాల్విన్ జాయ్
నిర్మాత: రామానుజ రెడ్డి
నిర్మాణ సంస్థ: బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేది: 23 అక్టోబర్ 2026
నంది అవార్డు గ్రహీత, 'అటు అమెరికా ఇటు ఇండియా', 'ఆత్రేయ' వంటి చిత్రాల డైరెక్టర్ శాంతికుమార్ చిలుముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా చిత్రం '321'. ‘లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్’ అనేది క్యాప్షన్.
డిఫరెంట్ టైటిల్
డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాను బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామానుజ రెడ్డి నిర్మించారు. 'లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్' అనే నిత్యనూతన కాన్సెప్ట్‌తో ఎలాంటి ఆర్భాటాలు, అసభ్యత లేకుండా స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇవాళ (అక్టోబర్ 23) థియేటర్లలో 321 మూవీ విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి 321 రివ్యూలో చూద్దాం.
లవ్ వర్సెస్ అరేంజ్డ్: కథా నేపథ్యం
పెళ్లి విషయంలో పూర్తి భిన్నమైన ఆలోచనలు కలిగిన ఇద్దరు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. జీవితాంతం తోడుగా ఉండే బంధానికి ప్రేమ వివాహమే అసలైన పునాది అని అభి (మోహిత్ పెడద) బలంగా నమ్ముతాడు. గతంలోని చేదు అనుభవాల వల్ల పెళ్లి తర్వాతే అసలైన ప్రేమ మొదలవుతుందని శ్రుతి (లావణ్య సహుకర) భావిస్తుంది.
అభి తండ్రి అతనికి సాంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేయాలని పట్టుబడగా, శ్రుతి తల్లి ఆమెను ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించి నగరానికి పంపిస్తుంది. అనుకోకుండా అభి, శ్రుతి ఒకే ఆఫీసులో ఉద్యోగులుగా కలుస్తారు. శ్రుతిని చూసిన తొలి చూపులోనే అభి ప్రేమలో పడతాడు. ఆఫీసులో సహోద్యోగికి సాయం చేసిన అభి మంచి మనసు శ్రుతికి నచ్చినా, పాత అనుభవాల కారణంగా తన భావాలను దాచుకుంటుంది.
{{/usCountry}}అభి తండ్రి అతనికి సాంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేయాలని పట్టుబడగా, శ్రుతి తల్లి ఆమెను ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించి నగరానికి పంపిస్తుంది. అనుకోకుండా అభి, శ్రుతి ఒకే ఆఫీసులో ఉద్యోగులుగా కలుస్తారు. శ్రుతిని చూసిన తొలి చూపులోనే అభి ప్రేమలో పడతాడు. ఆఫీసులో సహోద్యోగికి సాయం చేసిన అభి మంచి మనసు శ్రుతికి నచ్చినా, పాత అనుభవాల కారణంగా తన భావాలను దాచుకుంటుంది.
{{/usCountry}}ఇలాంటి సమయంలో అభికి గతంలో చూసిన పెళ్లి సంబంధం రాధ మళ్లీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మరోవైపు లయ అనే పేరుతో అభికి ఒక సీక్రెట్ ఫోన్ కాల్ నిరంతరం వస్తుంటుంది. ఈ భావోద్వేగ సంఘర్షణల మధ్య అభి ఎవరిని వివాహం చేసుకున్నాడు?, ఆ రహస్య కాల్స్ చేస్తున్న లయ ఎవరు?, చివరికి అభి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అభిపై ఉన్న ప్రేమను శ్రుతి వ్యక్తపరిచిందా? అనేదే మిగతా కథ.
విశ్లేషణ: సందేశంతో కూడిన ఫ్యామిలీ థ్రిల్లర్
ఇప్పటికీ నేటి సమాజంలో అరెంజ్డ్ మ్యారేజ్ బెటరా.. ప్రేమ వివాహం మంచిదా అనే ఆలోచన చాలామందిలో మెదిలుతూనే ఉంటుంది. అలాంటి కాన్సెప్టుతోనే 321 మూవీని తెరకెక్కించారు డైరెక్టర్. అయితే, ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే వాదన కంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అవగాహన, నిబద్ధత మాత్రమే దాంపత్య జీవితాన్ని నిలబెడతాయని దర్శకుడు శాంతికుమార్ సున్నితంగా చెప్పారు.
చిన్న చిన్న కారణాలతో విడిపోవాలనుకునే నేటి తరం యువతకు, మారాల్సిన పెద్దల ఆలోచనా విధానానికి ఈ సినిమా ఒక మంచి సందేశం ఇస్తుంది. కుటుంబ అనుబంధాలతో పాటు ఒక మిస్టరీ ఎలిమెంట్‌ను జోడించడం వల్ల కథనం చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది.
మూడు ముళ్లు, రెండు హృదయాలు, ఒక జీవితం అనే భావనను ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. కమర్షియల్ హంగులకు, అసభ్య హాస్యానికి తావులేకుండా దర్శకుడు శాంతికుమార్ బంధాల విలువలను సహజంగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంది.
నటీనటుల ప్రతిభ, సాంకేతిక బలం
అభి పాత్రలో మోహిత్ పెడద ఎంతో సహజంగా నటించాడు. వినోదం పంచడంతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ చక్కటి పరిపక్వత చూపించాడు. లావణ్య సహుకర శ్రుతి పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ హుందాతనాన్ని తీసుకొచ్చింది. అంతర్గత భావాలను మోసే ఉద్యోగినిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. వివాన్ సూర్య, లక్ష్మి వెన్నెల తమ పాత్రల పరిధి మేర కథకు అవసరమైన బలాన్ని చేకూర్చారు.
సంగీత దర్శకుడు కాల్విన్ జాయ్ అందించిన పాటలు, ఉత్కంఠను పెంచే నేపథ్య సంగీతం సన్నివేశాలను నిలబెట్టాయి. ఆఫీస్ పరిసరాలు, కుటుంబ వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ కెమెరాలో సహజంగా బంధించారు. రామానుజ రెడ్డి నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా కుదిరాయి.
ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్లింగ్ సస్పెన్స్
ఫైనల్‌గా చెప్పాలంటే ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్లింగ్ సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హాయిగా కుటుంబ సమేతంగా థియేటర్లో చూడాల్సిన మంచి సినిమా 321.