తెలుగులో ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో చాలా వరకు థియేటర్లలలో రిలీజ్ అయి ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండానే ఓటీటీలలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి
రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్

అలాంటి తెలుగు సినిమానే 4 గర్ల్స్. రివేంజ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెకెక్కిన 4 గర్ల్స్ సినిమాను యూనిక్విక్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమాకు యూ నరసింహులు, ఎస్ రమేష్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు.
సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలు, అమ్మాయిలపై గ్యాంగ్ రేపులు , మర్డర్స్ జరుగుతున్నాయి . అలా రీసెంట్‌గా జరిగిన ఒక రియల్ ఇంసెడెంట్‌ని బేస్ చేసుకుని ఈ 4 గర్ల్స్ సినిమాను తెరకెక్కించారు దర్శకనిర్మాతలు.
పగ తీర్చుకుందా
బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయానికి పోలీసులు ఏం చేశారు ? ఆ కుటుంబం సమాజాన్ని ఎలా ఎదుర్కొంది ? అసలు నేరస్థులు ఎవరు ? వాళ్ల్లు తప్పించుకుంటే నేరస్తుల్ని చనిపోయిన అమ్మాయి అక్క తన స్నేహితురాళ్లతో కలిసి ఎలా కనిపెట్టి పట్టుకుంది?. వాళ్లపై తన చెల్లి కి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుందా? లేక చట్టానికి అప్పగించిందా? వంటి అంశాలతో ఈ సినిమాను చిత్రీకరించారు.
న్యాయం దొరకనప్పుడు సమాజానికి ఎదురెళ్లి తప్పుడు దారిలోనైనా నేరస్థులను పట్టుకుని తమ చేతులతో శిక్షించి న్యాయానికి ఊపిరిపోయ్యచ్చనే అంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో 4 గర్ల్స్ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే, ఏకంగా 9 ఓటీటీల్లోకి నేరుగా 4 గర్స్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
9 ఓటీటీలు-5 భాషలు
అమెజాన్ ప్రైమ్, బీసీఐనీట్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, హంగామా ప్లే, టాటా ప్లే బింజ్, వాచో, వ్యూడ్, క్లౌడ్ మేకర్, జీసన్‌తోపాటు అమెజాన్ ఫైర్ స్టిక్ యాక్సెస్ ఉన్న టీవీలలో 4 గర్ల్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, తెలుగు , తమిళం , హిందీ , కన్నడ , మలయాళం వంటి 5 భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఓటీటీలో 4 గర్ల్స్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల నిర్మాతలు తమ సంతోషం వ్యక్తం చేశారు.
{{/usCountry}}అమెజాన్ ప్రైమ్, బీసీఐనీట్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్, హంగామా ప్లే, టాటా ప్లే బింజ్, వాచో, వ్యూడ్, క్లౌడ్ మేకర్, జీసన్‌తోపాటు అమెజాన్ ఫైర్ స్టిక్ యాక్సెస్ ఉన్న టీవీలలో 4 గర్ల్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అలాగే, తెలుగు , తమిళం , హిందీ , కన్నడ , మలయాళం వంటి 5 భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఓటీటీలో 4 గర్ల్స్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ పట్ల నిర్మాతలు తమ సంతోషం వ్యక్తం చేశారు.
{{/usCountry}}ఈ సందర్భంగా యూ నరసింహులు, ఎస్ రమేష్ మాట్లాడుతూ.. "మా సినిమాకు అన్ని ప్రముఖ ఓటీటీలలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఒరియెంటెడ్ క్రైమ్, రివేంజ్, థ్రిల్లర్ జోనర్‌లో చేసినందుకు ఆనందంగా ఉంది" అని తెలిపారు.
నిర్మాతల కామెంట్స్
"ఈ సందర్భంగా మా సినిమాని డైరెక్ట్‌గా అన్ని ఓటీటీ సంస్థలలో రిలీజ్ చేసిన బీసీఐనీట్ (Bcineet- B Cine Entertainments Private Limited) సంస్థ, బోయపాటి దిలీప్ కుమార్ (Dk Boyapati) గారికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. అందరూ మా సినిమాని చూసి మరింత ఆదరిస్తారని కోరుతున్నాం" అని 4 గర్ల్స్ నిర్మాతలు కోరారు.
ఇదిలా ఉంటే, ఎస్ శివ దర్శకత్వం వహించిన 4 గర్ల్స్ సినిమాలో శృతిక గాఒక్కర్, ఆకాంక్ష వర్మ, దితిప్రియ రాయ్, సెజల్ మాండవియ, అంకుర్, ప్రిన్స్, హన్సి శ్రినివాస్తవ కీలక పాత్రలు పోషించారు.