...
...
Next Story

National Awards 2026: ప్రియమణి మూవీకి 3 నేషనల్ అవార్డ్స్.. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ఎమోషనల్ కామెంట్స్

Aditya Dhar Reacts To Yami Gautam Article 370 National Awards: ప్రతిష్ఠాత్మక 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రియమణి కీలక పాత్ర పోషించిన ఆర్టికల్ 370 మూవీ ఏకంగా 3 నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. 3 విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు రావడం పట్ల ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ రియాక్ట్ అయ్యారు.

Published on: Jul 19, 2026, 07:25:43 IST
Advertisement

Aditya Dhar Reacts To Yami Gautam Article 370 National Awards: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత పవిత్రంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన శనివారం (జూలై 18) వెలువడింది. ఈ అవార్డుల రేసులో బాలీవుడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్టికల్ 370’ మూడు కీలక విభాగాల్లో జాతీయ అవార్డులను గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించింది.

ప్రియమణి సినిమాకు 3 అవార్డులు

ప్రియమణి మూవీకి 3 నేషనల్ అవార్డ్స్.. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ఎమోషనల్ కామెంట్స్
ప్రియమణి మూవీకి 3 నేషనల్ అవార్డ్స్.. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ఎమోషనల్ కామెంట్స్

ఆర్టికల్ 370 సినిమాలో ప్రదర్శించిన అద్భుత నటనకు గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోగా.. శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే ఈ చిత్రం దేశంలోనే ‘ఉత్తమ ఫీచర్ ఫిల్మ్’ (Best Feature Film) అవార్డును కూడా సొంతం చేసుకుంది.

భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదాను 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన యథార్థ రాజకీయ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రభుత్వ అధికారిణి పాత్ర

కేవలం ఉత్తరాదినే కాకుండా, దక్షిణాదిలోనూ ఆర్టికల్ 370 చిత్రానికి భారీ ఆదరణ దక్కింది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి ఇందులో ఒక కీలకమైన ప్రభుత్వ అధికారిణి పాత్ర పోషించడం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ అద్భుత విజయంపై సినిమా నిర్మాత, యామీ గౌతమ్ భర్త ఆదిత్య ధర్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

ఆనందంలో చిత్ర యూనిట్.. ఆదిత్య ధర్ ఎమోషనల్

ఈ విజయం దర్శకుడు ఆదిత్య సుహాస్ జాంభలే ప్రతిభకు, నటీనటుల కష్టానికి దక్కిన ప్రతిఫలమని ఆయన కొనియాడారు. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న జియో స్టూడియోస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే కూడా హర్షం వ్యక్తం చేస్తూ, సినిమా కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారం దక్కుతుందని అన్నారు.

దర్శకుడికి మూడో జాతీయ అవార్డు

సినిమాను ఉత్కంఠభరితంగా తెరకెక్కించిన దర్శకుడు ఆదిత్య సుహాస్ జాంభలేకు ఇది మూడో జాతీయ అవార్డు కావడం విశేషం. "ఒక చిత్ర దర్శకుడికి జాతీయ అవార్డు లభించడం కంటే పెద్ద గౌరవం మరొకటి ఉండదు. ఇది నా మూడో అవార్డు అయినప్పటికీ, మొదటిసారి వచ్చినంత సంతోషంగా ఉంది. మన దేశ చరిత్రలో నిలిచిపోయే ఒక అధ్యాయాన్ని సినిమాటిక్ నమ్మకంతో, హృదయపూర్వకంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నించాం" అని జాంభలే వివరించారు.

బి62 స్టూడియోస్, లోకేష్ ధర్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఆర్టికల్ 370 చిత్రంలో యామీ గౌతమ్, ప్రియమణితో పాటు రాముడిగా దేశవ్యాప్తంగా మెప్పించిన అరుణ్ గోవిల్, కిరణ్ కర్మార్కర్ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రలు పోషించారు.

జాతీయ స్థాయిలో దక్కిన ఈ గుర్తింపు చిత్ర బృందానికి చలనచిత్ర చరిత్రలో శాశ్వత స్థానాన్ని అందించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe