ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఇవాళ (జనవరి 20) డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఉన్న ఈ మూవీనే ‘ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ’. రొమాన్స్, ఫాంటసీతో కూడిన ఈ మూవీని తప్పకుండా చూడాలనే కామెంట్లు వస్తున్నాయి.
ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ ఓటీటీ

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ స్టోరీలతో, డిఫరెంట్ జోనర్ సినిమాలు వస్తాయి. అలాంటి ఓ విభిన్నమైన కథతో వచ్చిన చిత్రమే ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ. మంగళవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నాలుగు నెలల తర్వాత
థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ మూవీ. ఈ ఇంగ్లీష్ మూవీ సెప్టెంబర్ 19, 2025న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత జనవరి 20, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మార్గాట్ రాబీ, కొలిన్ ఫారెల్, కెవిన్ క్లిన్, ఫోబ్ వాలర్ తదితరులు నటించారు.
రొమాంటిక్ ఫాంటసీ
ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ సినిమా రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనికి కొగోనాడా డైరెక్టర్. ఈ చిత్రాన్ని కొలంబియా పిక్చర్స్, 30 వెస్ట్ ఇంపెరేటివ్ ఎంటర్ టైన్మెంట్ కలిసి నిర్మించాయి. దీనికి బ్రాడ్లీ థామస్, ర్యాన్ ఫ్రీడ్కిన్, యూరీ హెన్లీ, సెత్ రీస్ నిర్మాతలు.
ఏ బిగ్ బోల్డ్ బ్యూటీఫుల్ జర్నీ స్టోరీ
ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ డేవిడ్ (కొలిన్), సారా (మార్గాట్) చుట్టూ సాగుతోంది. వీళ్లిద్దరూ అపరిచితులు. ఓ వెడ్డింగ్ రిసెప్షన్ లో కలుసుకుంటారు. డేవిడ్ దగ్గర ఓ పాత కారు ఉంటుంది. అందులోని జీపీఎస్ డైరెక్ట్ గా సారా దగ్గరకు తీసుకెళ్తుంది. వీళ్లిద్దరూ కలిసి కార్లో జర్నీ స్టార్ట్ చేస్తారు.
{{/usCountry}}ఈ రొమాంటిక్ ఫాంటసీ మూవీ డేవిడ్ (కొలిన్), సారా (మార్గాట్) చుట్టూ సాగుతోంది. వీళ్లిద్దరూ అపరిచితులు. ఓ వెడ్డింగ్ రిసెప్షన్ లో కలుసుకుంటారు. డేవిడ్ దగ్గర ఓ పాత కారు ఉంటుంది. అందులోని జీపీఎస్ డైరెక్ట్ గా సారా దగ్గరకు తీసుకెళ్తుంది. వీళ్లిద్దరూ కలిసి కార్లో జర్నీ స్టార్ట్ చేస్తారు.
{{/usCountry}}ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే కారు తన జీపీఎస్ ఆధారంగా డేవిడ్, సారాను అడవిలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఓ మ్యాజిక్ డోర్ ఉంటుంది. ఆ తలుపులో నుంచి డేవిడ్, సారా వెళ్తారు. తమ గతంలోకి ప్రయాణిస్తారు. తన జీవితంలోని కీలక అనుభవాల్లోకి వెళ్లి తమను తాము చూసుకుంటారు.
ఒక డోర్ నుంచి వెళ్తే ఫస్ట్ లవ్, ఆ తర్వాత డోర్ హైస్కూల్, ఇంకోటి అమ్మ దగ్గరకు ఇలా డేవిడ్, సారా ప్రయాణిస్తుంటారు. మరి చివరకు ఏం జరిగింది? డేవిడ్, సారా కలిసి కారును ఎందుకు తగలబెట్టారు? అన్నది సినిమాలో చూడాల్సిందే.